ప్రపంచదేశాల ప్రజలను కరోనా వైరస్ ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే.చైనాలో పురుడు పోసుకున్న అతిసూక్ష్మజీవి కరోనా.
కంటికి కనిపించకుండా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు పాకేసి మరణ మృదంగం మోగిస్తోంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు బలైపోయిన వారి సంఖ్య ఏకంగా 7.4 లక్షల మించిపోయింది.మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అంతుచిక్కని విధంగా నమోదవుతున్నాయి.
ఈ కరోనా నుంచి రక్షించుకోవాలంటే.శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే రోగ నిరోధక శక్తి పెంచడంలో రైస్ కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును, రైస్ తినడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
అయితే రైస్ తింటే బరువు పెరుగుతారని చాలామంది ఆకలిని చంపుకుంటూ పొట్టను ఇబ్బందులకు గురి చేస్తారు.కానీ, మితంగా తీసుకుంటే రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మినరల్స్, విటమిన్స్ మెండుగా ఉండే రైస్‌ను రోజుకు ఒకపూట తింటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇక శారీరక శ్రమ చేసేవారు రైస్‌ను ఎంత తిన్నా ఎలాంటి సమస్య ఉండదు.అలాగే రైస్ తీసుకోవడం వల్ల.అందులో ఫైబర్ భయంకర క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.ప్రతిరోజు మోతాదు మించికుండా రైస్ తీసుకోవడం వల్ల అల్జైమర్స్ సమస్య వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
కాబట్టి, రైస్ తింటే బరువు పెరుగుతారు లేదా ఏవో అనారోగ్య సమస్యలు వస్తాయి అన్న అపోహలు పక్కన పెట్టి.నిరభ్యంతరంగా రైస్ తినవచ్చు.