సుశాంత్ తమని డ్రగ్స్ కోసమే వాడుకున్నాడు… రియా సంచలన ఆరోపణలు  

Rhea says Sushant was the only consumer of drugs, Bollywood, Drugs Scandal, Drugs Mafia, Sushant Singh Rajput, Rhea Chakrabory, NCB, Drugs Case - Telugu Bollywood, Drugs Case, Drugs Mafia, Drugs Scandal, Ncb, Rhea Chakrabory, Rhea Says Sushant Was The Only Consumer Of Drugs, Sushant Singh Rajput

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో అరెస్ట్ అయినా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇప్పుడు ఎన్సీబీ వలలో చిక్కుకొని బయటకి రాలేని స్థితిలో ఉంది.ఆమె ఇచ్చిన ఆధారాలతో మరో నలుగురు హీరోయిన్స్ కి కూడా ఎన్సీబీ అధికారులు విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు.

TeluguStop.com - Rhea Says Sushant Was The Only Consumer Of Drugs

ఇదిలా ఉంటే తన కుమారుడుకి డ్రగ్స్ అలవాటు చేసింది, అతని ఆత్మహత్యకి కారణం అయ్యింది రియా చక్రవర్తి అని, ఆమె ప్రవర్తన కారణంగానే తన కొడుకు చనిపోయాడని, సుశాంత్ ని రియా ఒక ఏటీఎంలా వాడుకుంది అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వయిరీ జరుగుతుంది.

ఇదిలా ఉంటే సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఇన్ని రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తాను సుశాంత్ బాధితురాలిని అంటూ కొత్త వాచకం మొదలు పెట్టింది.అతని మీద సంచలన ఆరోపణలు చేసింది.

TeluguStop.com - సుశాంత్ తమని డ్రగ్స్ కోసమే వాడుకున్నాడు… రియా సంచలన ఆరోపణలు-General-Telugu-Telugu Tollywood Photo Image

తనను, తన సోదరుడిని సుశాంత్ డ్రగ్స్ కోసం ఫుల్ గా వాడుకుని అడ్డంగా బుక్ చేశాడని ఆరోపించింది.దీనివల్ల తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నానని రియా వెల్లడించింది.

సుశాంత్ కు విపరీతంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, డ్రగ్స్ తీసుకురావాలని తన స్టాఫ్ ను బలవంతం చేసేవాడని పేర్కొంది.నన్ను, నా సోదరుడు షోవిక్ ను కూడా డ్రగ్స్ కోసం పిలిచేవాడని, అలాగే డ్రగ్స్ కోసం తమని పావులుగా వాడుకున్నాడని, అయితే ఈ విషయంలో అతను ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడంతో మేము అడ్డంగాబుక్కయ్యాం అంటూ రియా కలత చెందింది.

డ్రగ్స్ కి బానిసైన సుశాంత్ బతికి ఉంటే కేవలం ఏడాది జైలుతోనే బయటపడేవాడని రియా పేర్కొంది.ఆత్మహత్యకు మూడు రోజుల ముందు వంటవాడిని డ్రగ్స్ రెడీ చేయాల్సిందిగా సుశాంత్ కోరాడని, అతడు బాక్స్ లో పెట్టిన డ్రగ్స్ ని వినియోగించాడని కూడా రియా వెల్లడించింది.

ఈ కేసులో తమని బలిపశువులుగా మార్చే కుట్ర జరుగుతుందని రియా ఆవేదన వ్యక్తం చేసింది.

#SushantSingh #Drugs Case #Drugs Scandal #RheaSays #Drugs Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rhea Says Sushant Was The Only Consumer Of Drugs Related Telugu News,Photos/Pics,Images..