సుశాంత్‌ను ఎప్పుడు వారు పట్టించుకోలేదంటున్న రియా  

rhea chakraborty comments on sushanth sister and his family , Sushanth Singh Rajputh, Reha chakravarthy, Sushanth Sister, Sushanth Family, CBI, Reha Chakravarthy Bail Pittion, - Telugu Bollywood, Cbi Case, Rhea Chakraborty, Suhanth Singh, Sushanth Case

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసు తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.సుశాంత్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

TeluguStop.com - Rhea Chakraborty Comments On Sushanth Sister And His Family

ఇటీవల ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెయిల్ పిటిషన్ విచారణకు హాజరు అయింది.ఈ సందర్భంగా ఆమె న్యాయమూర్తి ముందు సుశాంత్ తో తనకున్న సంబంధం గురించి మరియు అతనికి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాల గురించి ముఖ్యంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

సుశాంత్ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా అతని ఆరోగ్యం విషయంలో శ్రద్ధ లేదని కేవలం సంపాదన విషయంలోనే వారు అతడికి సన్నిహితంగా ఉండేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.సుశాంత్‌ సోదరితో ఎప్పుడు కూడా అతడి ఆర్థిక సంబంధమైన విషయంలో గొడవ పడుతూ ఉండేవాడు అని పేర్కొంది.

TeluguStop.com - సుశాంత్‌ను ఎప్పుడు వారు పట్టించుకోలేదంటున్న రియా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రియా చక్రవర్తి వ్యాఖ్యలపై ఇప్పటికే సుశాంత్ సోదరి స్పందించింది.రియా తనపై అనవసరమైన వ్యాఖ్యలు చేయిస్తుందని సుశాంత్ కు తనకు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మాకు మాత్రమే తెలుసు అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసింది.

సుశాంత్ కు నాకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఆమె పేర్కొంది. రియా చక్రవర్తి ఈ కేసు నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మమ్ములను ఇరికించేందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది.

రియా కు కచ్చితంగా సుశాంత్ మృతి కేసుతో సంబంధం ఉందని ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుశాంత్‌ మృతికి రియా కారణం అంటూ అభిమానులు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు.

అందుకే సీబీఐ వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.అయితే ఆమె అరెస్టయింది డ్రగ్స్ కేసులో అని ఆమెకు సుశాంత్ కేసుతో సంబంధం వల్ల ఆమె అరెస్ట్‌ అవ్వలేదని ఇప్పటికే సీబీఐ వారు తేల్చి చెప్పారు అంటూ ఆమె తరపు లాయర్‌ అంటున్నారు.

ఏది ఏమైనా రియా ఈ కేసు నుండి బయట పడేందుకు మరికాస్త సమయం పట్టవచ్చు.

#Sushanth Case #Suhanth Singh #CBI Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rhea Chakraborty Comments On Sushanth Sister And His Family Related Telugu News,Photos/Pics,Images..