అభినవ ద్రౌపదిగా కనిపించబోతున్న రియా చక్రవర్తి

బాలీవుడ్ లో సుశాంత్ ఆత్మహత్య తర్వాత భాగా పాపులర్ అయిన పేరు రియా చక్రవర్తి.సుశాంత్ తో రియా చక్రవర్తి ప్రేమ వ్యవహారం నడపడం, చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె అతని నుంచి బయటకి వచ్చేయడం జరిగింది.

 Rhea Chakraborty As Draupadi From Mahabharat-TeluguStop.com

దీంతో సుశాంత్ మృతికి రియా చక్రవర్తి కారణం అని అందరూ విమర్శలు చేశారు.ఇక కొంత మంది నెటిజన్లు అయితే మరింత శృతి మించి రియా మీద మర్డర్ కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు.

సుశాంత్ తండ్రి కూడా రియా చక్రవర్తి తన కొడుకు మృతికి కారణం అంటూ ఆరోపణలు చేశారు.అలాగే సుశాంత్ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడటం అందులో మెయిన్ ముద్దాయిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి రావడం జరిగింది.

 Rhea Chakraborty As Draupadi From Mahabharat-అభినవ ద్రౌపదిగా కనిపించబోతున్న రియా చక్రవర్తి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆమెని అరెస్ట్ చేసి కొంత కాలం జైల్లో కూడా వచ్చారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చిన రియా మళ్ళీ సుశాంత్ కేసు డిప్రెషన్ నుంచి బయటపడటానికి సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ప్రయత్నాలు చేస్తుంది.ఈ నేపధ్యంలో తెలుగులో ఇప్పటికే ఒక అవకాశం సొంతం చేసుకుందని టాక్.

అలాగే హిందీలో మహాభారతం ఆధారంగా తెరకెక్కించే ఒక మూవీలో ద్రౌపది పాత్ర కోసం రియా చక్రవర్తిని ఫైనల్ చేసారని బిటౌన్ లో వినిపిస్తుంది.మరి ఇంది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేంత వరకు వేచి చూడాలి.

ఇక సురేష్ ప్రొడక్షన్ లో రానా నిర్మించబోయే కొత్త సినిమాలో రియా చక్రవర్తి హీరోయిన్ గా ఖరారైందని టాక్.

#Draupadi #B-Town #Mahabharat #SushanthSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు