ఆంధ్రా సీఎంను కిడ్నాప్‌ చేస్తాడట!

వైవిధ్యానికి పెద్ద పీట వేసే వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వారానికి ఒక సినిమా చొప్పున ప్రకటిస్తూ ఉంటాడు.అయితే ఆ సినిమాల్లో ఏదో ఒకటి మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

 Rgv’s Next Movie On Ap And Telangana Cms-TeluguStop.com

ఈయన ప్రకటించిన పలు సినిమాలు ప్రకటన వరకు వచ్చి ఆగాయి, కొన్ని షూటింగ్‌ ప్రారంభం కాకుండానే ఆగాయి, కొన్ని షూటింగ్‌ కాస్త జరిగిన తర్వాత ఆగిపోయాయి.తాజాగా ఈయన మరో వైవిధ్యభరిత సినిమాను ప్రకటించాడు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపించింది.దాన్ని కథా వస్తువుగా తీసుకుని వర్మ తన తర్వాత సినిమాను తెరకెక్కిస్తాను అంటున్నాడు.

తాజాగా తాను తర్వాత చేయబోతున్న సినిమా గురించి ట్విట్టర్‌లో చెప్పుకొచ్చిన వర్మ.‘ఆంధ్రా సీఎం కిడ్నాప్‌’ అనే టైటిల్‌కు ‘తెలంగాణ సీఎం అనుమానితుడు’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

అందరిని ఆకర్షిస్తున్న ఈ టైటిల్‌తో తప్పకుండా వర్మ సినిమా చేయాలని కొందరు కోరుతున్నారు.వివాదాస్పద అంశంగా ఈ సినిమా మంచి పబ్లిసిటీ తెచ్చుకునే అవకాశాలున్నాయి.

అయితే సెన్సార్‌ బోర్డు ఈ టైటిల్‌కు, వర్మ సినిమాకు అనుమతి ఇచ్చేది అనుమానమే.చూద్దాం.

వర్మ ఏదైనా చేయగలడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు