ఈసారి వీరప్పన్‌

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వారంకు ఒక సినిమా చొప్పున ప్రకటిస్తూ వస్తున్నాడు.అందులో ఎన్ని సినిమాలను పూర్తి చేస్తాడో తెలియదు కాని, మూడు రోజుల క్రితం ఒక సినిమాను అనౌన్స్‌ చేసిన వర్మ తాజాగా మరో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

 Rgv’s Next Film Based On Veerappan-TeluguStop.com

ఇప్పటికే వర్మ తెరకెక్కించిన, తెరకెక్కిస్తున్న దాదాపు అరడజను సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.అవే కాకుండా తాజాగా మరో రెండు సినిమాలను ఈయన ప్రకటించి అందరిని ఆశ్చర్య పర్చుతున్నాడు.

కామెడీ హర్రర్‌ నేపథ్యంలో ‘సైలెంట్‌’ అనే మూకీ సినిమా చేస్తానని చెప్పిన మూడు రోజుల్లోనే వర్మ మరో రియల్‌ స్టోరీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా వర్మ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతున్నాడు.వీరప్పన్‌ కథాంశంతో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో రాజ్‌ కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌ హీరోగా నటించనున్నాడు.గతంలో రాజ్‌ కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో శివరాజ్‌ కుమార్‌ను ఈ సినిమాకు హీరోగా ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు.

ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube