వర్మ కొత్త సినిమా 'మెగా ఫ్యామిలీ', ఇక వారికి రక్త కన్నీరే

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో నందమూరి ఫ్యామిలీని ఒక ఆట ఆడేసుకున్న రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం చేస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో చంద్రబాబు నాయుడు మరియు ఆయన కొడుకు ఇంకా పలువురిని ఏకి పారేస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రస్థావన కూడా తీసుకు రావడంతో మెగా ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో వర్మపై విమర్శలు చేశారు.

 Rgvnewmovie Is Megafamily With The Tag39 Pillala Katha-TeluguStop.com

నీకు ఒక ఫ్యామిలీ ఉందనే విషయాన్ని మర్చి పోవద్దంటూ హెచ్చరించారు.ఎవరైనా తనను హెచ్చరిస్తే రెచ్చి పోయే వ్యక్తి వర్మ.

Telugu Pillala Katha, Anasuya, Chiranjeevi, Jabardasr, Kammarajyam, Pawan Kalyan

 

మెగా ఫ్యాన్స్‌ తనను రెచ్చగొట్టడంతో ఏకంగా మెగా ఫ్యామిలీ అంటూ ఒక సినిమాను తీసేందుకు సిద్దం అయ్యాడు.టైటిల్‌ మెగా ఫ్యామిలీ అని పెట్టి 39 పిల్లల కథ అంటూ ఈ సినిమా కథను లీక్‌ చేశాడు.ప్రస్తుతం చేస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తర్వాత ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ సినిమాను తీస్తానంటూ వర్మ ప్రకటించాడు.గతంలో వర్మ ప్రకటించి వదిలేసేవాడు.కాని ఇప్పుడు వర్మ చెప్పిన ప్రతి సినిమాను నెల రెండు నెలల్లో తీసి అవతల పారేస్తున్నాడు.

Telugu Pillala Katha, Anasuya, Chiranjeevi, Jabardasr, Kammarajyam, Pawan Kalyan

  సక్సెస్‌ ఫ్లాప్‌ అనే సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సినిమాలు తీస్తూ ఉన్నాడు.వివాదాలతో ఎప్పుడు మీడియాలో ఉంటున్నాడు.మొత్తానికి రామ్‌ గోపాల్‌ వర్మ ఈసారి మెగా ఫ్యామిలీకి మరియు మెగా ఫ్యాన్స్‌కు రక్తకన్నీరు కారేలా చేస్తాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద ఎత్తున ఈ చిత్రంకు సంబంధించిన చర్చ మొదలైంది.నిన్న సాయంత్రంమే ఈ విషయాన్ని వర్మ ప్రకటించాడు.అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి కామెంట్స్‌ రాలేదు.కాని మెగా ఫ్యాన్స్‌ మాత్రం వర్మపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube