వర్మజీ... చచ్చిన పామును ఇంకా ఎందుకు చంపడం  

Rgv Wants To Release Laxmi\'s Ntr Movie Still In Ap-laxmis Ntr,rgv,tdp,viral In Social Media,ys Jagan

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేసినా కూడా సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంచలనాత్మక దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఎంతోటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఓడిపోవడంకు ఎన్నో కారణాలు ఉంటే, అందులో వర్మ తీసిన ఆ సినిమా, దాని ప్రమోషన్‌కు వర్మ చేసిన ప్రయత్నాలు కూడా అయ్యి ఉంటాయి అనడంలో సందేహం లేదు..

వర్మజీ... చచ్చిన పామును ఇంకా ఎందుకు చంపడం-RGV Wants To Release Laxmi's NTR Movie Still In AP

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంను ఏపీలో విడుదల చేయకుండా చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశాడు. తెలంగాణలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తుంది.

ఇలాంటి సమయంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. చంద్రబాబును విలన్‌గా ఆ చిత్రంలో చూపించబోతున్నారు. చంద్రబాబు నాయుడు పాత్రను చాలా సీరియస్‌గా, విలన్‌గా ఆ చిత్రంలో చూపించడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు మొదటి నుండి ఆ సినిమాపై వ్యతిరేకత చూపుతూ వచ్చారు..

తాజాగా ఏపీలో జగన్‌ పాలన ఆరంభం అయిన కారణంగా సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్దం అయ్యింది. ఏపీలో జగన్‌ పాలనకు మే 30వ తారీకున ప్రమాణ స్వీకారం జరుగబోతుంది. ఆ తర్వాత రోజు అంటే మే 31వ తారీకున వర్మ తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పటికే ఓడిపోయి బిక్కమొహం వేసిన చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకు వర్మ జీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఏపీలో విడుదల అవసరమా అంటూ కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి మాటైనా వింటే ఆయన వర్మ ఎందుకు అవుతాడు. అందుకే ఆయన తాను అనుకున్నట్లుగా సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.