అనందయ్యని జాతీయ నిధిగా గుర్తించలంటున్న ఆర్జీవి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. వ్యాక్సిన్ కొరతతో భారత్ దేశం అల్లాడుతోంది.బెడ్స్ ఖాళీగా లేక ఆక్సిజన్ సరైన విధంగా అందక చాలా మంది కన్నుమూస్తున్నారు.వారి ఇళ్లలో తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.ఆంక్షలను పాటించకుండా కరోనాను కొనితెచ్చుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 Rgv Wants To Recognize Anandayyani As A National Treasure . Ram Gopal Varma, Twe-TeluguStop.com

ఇటువంటి సమయంలో నెల్లూరు ఆనందయ్య వైద్యం సంచలనం రేకెత్తిస్తోంది.నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది.

వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి క్యూ కడుతున్నారు.చాలామంది సెలబ్రిటీలు ఆనందయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు.

ఇదే క్రమంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

రామ్‌గోపాల్‌ వర్మ ఆనందయ్యను ఆకాశానికెత్తేశారు.

ఆనందయ్యను జాతి సంపదగా గుర్తించలేరా అని ప్రభుత్వాన్ని వర్మ సూటిగా ప్రశ్నించారు.అంతే కాదు ఆయనకు మిలటరీతో భద్రత కల్పించాలని కూడా తన తాజా ట్వీట్‌లో వర్మ ప్రభుత్వానికి సూచించారు.

తద్వారా ఆనందయ్య వైద్యంపై ఆయన ఎంతగా ఇంప్రెస్‌ అయ్యారో చెప్పకనే చెప్పారు.గతంలో సోనూ సూద్‌తో పాటు పలువురు సామాజిక సేవ చేస్తున్న వారిపై ట్వీట్లు పెట్టిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ఆనందయ్య వైద్యంపై ట్వీట్‌ పెట్టడం సంచలనంగా మారింది.

అతి తక్కువ కాలంలో తన వైద్యంతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఆనందయ్యపై వర్మ పెట్టిన ట్వీట్‌ కూడా వైరల్‌ అవుతోంది.ఈ ట్వీట్‌ చూసిన వారు వర్మను ప్రశంసిస్తూ రీట్వీట్‌ కూడా చేస్తున్నారు.

గతంలో ఎన్నో వివాదాస్పద అంశాలపై ట్వీట్లు చేసి విమర్శల పాలైన అనుభవం ఉన్న వర్మ ఈసారి ఆనందయ్యపై ప్రసంసలు కురిపించడం, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడింది.

రాష్ట్ర ప్రభుత్వం అక్కడి వెళ్లకుండా జనాల్ని కట్టడి చేస్తున్నా ఇంకా జనం కృష్ణపట్నం వైపు పరుగులు పెడుతున్నారు.దీంతో నెల్లూరులో భారీగా పోలీసులను మోహరించి అక్కడికి వెళ్లేవారిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube