కడపకు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ను తీసుకు వెళ్తున్న వర్మ... కారణం ఇదేనా?

రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.ఇంకా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకోని ఈ చిత్రం విడుదల గురించి అంతా కూడా టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

 Rgv Wants To Grand Pre Release Lakshmis Ntr In Kadapa-TeluguStop.com

ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఇస్తుందా లేదా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వర్మ మాత్రం సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.అసలు సెన్సార్‌ గురించిన ఆలోచన ఆయనకు ఉన్నట్లుగా లేదు.

సినిమా భారీగా విడుదల చేయడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

సినిమా పబ్లిసిటీలో భాగంగా రెండు మూడు రోజుల్లో కడపలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.కడపలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రమోషన్‌ కార్యక్రమం చేస్తున్నాను.దానికి ‘వెన్నుపోటు’ అలియాస్‌ ఎన్టీఆర్‌ 9 అనే పేరును కూడా పెట్టినట్లుగా వర్మ ప్రకటించాడు.

వర్మ ఎందుకు కడపలోనే ఈ కార్యక్రమం పెట్టాడు అనే విషయమై అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది.వేరే ఎక్కడ ఈ కార్యక్రమం పెట్టినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు అడ్డుకునే అవకాశం ఉంది.

కాని కడపలో ఆ అవకాశం ఉండదు.అందుకే కడనపు వర్మ ఎంచుకుని ఉంటాడు అని కొందరు అంటున్నారు.

వైకాపాకు పెట్టిన కోట వంటి కడప జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమంను నిర్వహిస్తున్నాను అని, నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు, నందమూరి అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా వర్మ పిలుపునిచ్చాడు.మరి వర్మ నిర్వహించబోతున్న ఆ కార్యక్రమం ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందో చూడాలి.వర్మ చాలా వరకు ఈ సినిమాను వివాదం చేయాలనే చూస్తున్నాడు.కడపలో కార్యక్రమం నిర్వహించడం కూడా చర్చనీయాంశం అయ్యి సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది.ఈనెల 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం చంద్రబాబు నాయుడు పరువును గంగలో కలిపేలా ఉంటుందేమో అని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా వారు తాము పట్టించుకోము అని తేల్చి చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube