వైఎస్‌, కేసీఆర్‌లను సైతం వదలను అంటున్న వర్మ... ఇకపై ఇదే రచ్చ ఖాయం అంటున్న దర్శకుడు

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్దం అయ్యింది.నేడు విడుదల అవ్వాల్సిన మూవీ సెన్సార్‌ కాని కారణంగా ఆలస్యంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

 Rgv Wants To Do Biopic Of Ysr And Kcr-TeluguStop.com

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వర్మ టీవీ5 మూర్తికి ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

పెద్ద ఎత్తున తాను ఇకపై బయోపిక్‌లు తీస్తాను అంటూ చెప్పకనే చెప్పాడు.

ప్రస్తుతం చేసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కాకుండా వరుసగా ఇకపై బయోపిక్‌లు తీస్తూనే ఉంటాను అని, తనకు తోచినవి, మనసుకు నచ్చినవి సినిమాలుగా తీయాలనుకునే నేను వరుసగా బయోపిక్‌లు తీయాలని భావిస్తున్నట్లుగా మూర్తితో అన్నాడు.ఇప్పటికే రెడ్డి గారు పోయారు అనే సినిమాకు శ్రీకారం చుట్టాను.త్వరలోనే అది మొదలు కాబోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనంను క్రియేట్‌ చేసిన రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత ఏం జరిగింది, రాజకీయాల్లో పెను మార్పులు ఎలా వచ్చాయి అనే విషయాలను తాను రెడ్డి గారు పోయారు అనే సినిమాలో చూపించబోతున్నట్లుగా వర్మ చెప్పాడు.

రాజశేఖర్‌ రెడ్డి చనిపోవడంతో ఆ సినిమా ప్రారంభం అవుతుంది.ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు మరియు రాష్ట్రం విడిపోవడం వంటివి ఎలా జరిగాయి అనేది వర్మ సినిమాలో చూపిస్తాడట.ఇక కేసీఆర్‌ గురించి కూడా రీసెర్చ్‌ చేస్తున్నాను, త్వరలోనే ఆ సినిమాను కూడా చేస్తానంటూ వర్మ ప్రకటించాడు.

అయితే వర్మ ఎన్నో సినిమాలు ప్రకటిస్తాడు కాని అందులో ఎక్కువ శాతం సినిమాలు చేయడు అనే టాక్‌ ఉంది.అందుకే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే వరకు నమ్మకం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube