వర్మ మందేసి ఆ పని చేస్తాడు అంటున్న నాగార్జున     2016-12-20   22:08:07  IST  Raghu V

ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుతూనే ఉండుంటారు. ఇక ట్విట్టర్ అకౌంట్ ఉన్న లేకపోయినా, అక్కడ ఆర్జీవీ పోస్ట్ చేసే వింత వింత విషయాల గురించి మీకు తెలియనిది కాదు. మెగాస్టార్ చిరంజీవి అయినా, సూపర్ స్టార్ మహేష్ బాబు అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సరే, ఆర్జీవి ట్వీట్స్ కి బలికావాల్సిందే.

వ్యంగంగా మాట్లాడటంలో ఆర్జీవి తరువాతే ఎవరైనా అని ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఉంటాయి మరి ఆర్జీవి ట్వీట్స్. ఎవరు తిట్టినా పట్టించుకోడు. మెగా ఫ్యాన్స్ కి అయితే చుక్కలు చూపిస్తాడు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఇంత ధైర్యంగా హీరోల మీద, డైరెక్టర్ల మీద జోకులు వేయడం ఆర్జీవికి తప్ప మరొకరికి సాధ్యం కాదు.

ఇక ఆర్జీవి వేసే ఆ ట్వీట్లు మద్యం తాగాకా హ్యాంగోవర్ లో వేసినట్లు ఉంటాయని చాలామందికి డౌట్. అదే నాగార్జునకి కూడా వచ్చింది. ఎప్పుడూ బోర్ కొట్టినా, ఆర్జీవి ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేస్తారట నాగార్జున. ఇది వోడ్కా మొదటి రౌండ్ లో పోస్ట్ చేసుంటాడు, ఇది రెండొవ రౌండ్ తరువాత, ఈ ట్వీట్ ఫుల్ బాటిల్ తాగిన తరువాత వేసుంటాడు అని అనుకుంటూ నవ్వుకుంటారట నాగ్. ఈ విషయాన్ని నాగార్జున నిన్న జరిగిన “వంగవీటి” సినిమా ఫంక్షన్ లో చెప్పారు.