భీమ్లా నాయక్ పై వర్మ పోల్‌.. మండి పడుతున్న ఫ్యాన్స్‌

పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు రామ్ గోపాల్ వర్మ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు.వర్మ ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని వివాదంలోకి లాగుతూ ట్వీట్ చేస్తూ ఉన్నాడు.

 Rgv Tweets About Pawan Bheemla Nayak Hindhi Release , Bheemla Nayak , Film Ne-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.ఈనెల 25వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

మలయాళం మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా విడుదల విషయంలో ఇన్ని రోజులు గందరగోళ వ్యవహారం నెలకొంది.ఎట్టకేలకు ఆ విషయంపై క్లారిటీ రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఈ సమయంలో అభిమానులను మరియు సినీ వర్గాలను గందరగోళానికి గురి చేసేలా వర్మ వ్యవహరిస్తున్నాడు అంటూ ఒక వర్గం ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పవన్ నటించిన ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ చేయాలంటూ వర్మ డిమాండ్ చేస్తున్నాడు.

ఇది కావాలని ఆయన పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేసే విధంగా చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హిందీ లో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలాగు ఆడవు.ఆ విషయం అందరికి తెలిసిందే.అయినా కూడా హిందీలో విడుదల చేయాలని ఆయన అడుగుతున్నాడు.

ట్విట్టర్లో తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక పోల్‌ పెట్టాడు.పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా పుష్ప మాదిరిగా హిందీలో సత్తా చాటుతుంది అని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు చాలా మంది అవునని మరికొందరు కాదని సమాధానమిచ్చారు 53 శాతం మంది అల్లు అర్జున్ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆకట్టుకోలేరు అంటూ సమాధానమిచ్చారు.కేవలం 47 శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ కి పుష్ప ను బీట్ చేసే సత్తా ఉందని చెప్పుకొచ్చారు.

ఆయన ఈ విషయం ను షేర్ చేసిన తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరిగింది.ఆయన పోలింగ్ కే పవన్ కళ్యాణ్ కు అత్యధికంగా ఓట్లు వచ్చాయి.

పుష్ప సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా భీమ్లా నాయక్ హిందీలో వసూళ్లు రాబట్టగలదు అంటూ పవన్ అభిమానులు ట్విట్టర్ ద్వారా వర్మ కు పోలింగ్ తో సమాధానం ఇచ్చారు.వర్మ ఈ సమయంలో ఇలాంటి హడావిడి చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Rgv Tweets About Pawan Bheemla Nayak Hindhi Release , Bheemla Nayak , Film News , Pawan , RGV , Ram Gopal Varma , Pawan Kalyan , Tweet , Satire , Tweets , Allu Arjun - Telugu Allu Arjun, Bheemla Nayak, Pawan, Pawan Kalyan, Ram Gopal Varma, Satire, Tweet, Tweets

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube