వర్మ సినిమాకు రూ. 200 కాదు రూ.500 అయినా పెట్టొచ్చు

రామ్‌ గోపాల్‌ వర్మ కొన్ని రోజుల క్రితం తీసుకు వచ్చిన క్లైమాక్స్‌ సినిమాను ఆన్‌లైన్‌లో చూసేందుకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంది.అయితే ఈసారి తెరకెక్కించిన నగ్నం సినిమాను చూడాలంటే మాత్రం రెండు వందల రూపాయలు చెల్లించాల్సిందే.

 Rgv Nagnam Movie Latest Update, Rgv, Climax, Nagnam, Coronavirus, Tollywood, Dir-TeluguStop.com

త్వరలో విడుదల కాబోతున్న నగ్నం సినిమా రెండవ ట్రైలర్‌ను వర్మ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఈ ట్రైలర్‌ కూడా సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వారు రెండు వందలు ఏం ఖర్మ ఏకంగా అయిదు వందలు పెట్టి చూసేందుకు కూడా వేచి చూస్తున్నారు.

ఈ చిత్రంతో వర్మ అనుకున్నది సాధిస్తే మరో సినిమా ను కూడా ఇదే తరహాలో తీసి ఈసారి అయిదు వందలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వర్మ బిజినెస్‌ టెక్నిక్‌కు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా వర్మ కొత్తగా తీసుకు వచ్చిన ఈ విధానం అందరికి బాగా నచ్చింది.

భవిష్యత్తులో స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఇలాగే విడుదల అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అడల్ట్‌ సినిమాలు మాత్రమే ఇలా వస్తున్నాయి.ఆ తర్వాత కొత్త సినిమాలు అన్ని కూడా ఇలాగే వస్తాయి.

వర్మ తీసిన ఈ విభిన్నమైన అడల్ట్‌ చిత్రంను ప్రేక్షకులు భారీ మొత్తం రేటు పెట్టినా కూడా చేసే అవకాశం ఉందని టాక్‌ వినిపస్తుంది.అందుకే తన క్లైమాక్స్‌ సినిమా కంటే ఎక్కువగా అంటే రెండు వందల రూపాయలను ఈ చిత్రం కోసం వర్మ పెట్టాడు.

క్లైమాక్స్‌ సినిమా కంటే రెట్టింపు ఆదాయం ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube