పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమాని పాత్రలో రామ్‌ గోపాల్‌ వర్మ  

RGV to play Pawan Kalyan Fan Role, Pawan Kalyan, Fan Role, RGV, Power Star,Ram Gopal varma in Power Star Movie - Telugu Fan Role, Pawan Kalyan, Power Star, Ram Gopal Varma In Power Star Movie, Rgv, Rgv To Play Pawan Kalyan Fan Role

రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.అంతా కొత్త వారితో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, ఆయన మానసిక పరిస్థితి ఏంటీ అనే కథతో రూపొందిస్తున్నాడట.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.45 నిమిషాల నుండి గంట నిడివి ఉండే సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యే స్థితికి వచ్చిందట.

 Rgv To Play Pawan Kalyan Fan Role

ఈ చిత్రంలో రామ్‌ గోపాల్‌ వర్మ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని పాత్రలో వర్మ కనిపించబోతున్నాడట.పదే పదే పవన్‌ ను దేవుడు అంటూ నాయకుడు అంటూ కీర్తించే పాత్రను వర్మ పోషిస్తున్నాడట.పవన్‌కు ఇష్టమైన అభిమానిగా వర్మ నటిస్తున్నాడు.

తర్వాత ఎన్నికల్లో గెలుపు మనదే, నీను నీ భక్తుడిని అంటూ పదే పదే ఆ డైలాగ్‌ను వర్మ చెబుతూ ఉంటాడట.చాలా ఫన్నీగా వర్మ పాత్ర ఉంటుందని కాకుంటే అది పవన్‌ అభిమానులకు మింగుడు పడకపోవచ్చు అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమాని పాత్రలో రామ్‌ గోపాల్‌ వర్మ-Movie-Telugu Tollywood Photo Image

రామ్‌ గోపాల్‌ వర్మ తీసుకు రాబోతున్న పవర్‌ స్టార్‌ మూవీలో చిరంజీవి నాగబాబుల ప్రస్థావన ఉంటుంది అని ఫొటోలు విడుదల చేసి చెప్పకనే చెప్పిన విషయం తెల్సిందే.వర్మ ఈ చిత్రంలో ఎవరిని తప్పుగా చూపించబోవడం లేదు అంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారిపై ఒట్టు పెట్టాడు.మరి వర్మ ఒట్టును నిలుపుకుని పవన్‌కు వ్యతిరేకంగా కాకుండా సినిమా తీస్తాడా అంటే ఖచ్చితంగా నమ్మకం లేదని ఆయన అభిమానులు స్వయంగా అంటున్నారు.

#Power Star #Pawan Kalyan #Fan Role #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv To Play Pawan Kalyan Fan Role Related Telugu News,Photos/Pics,Images..