మెగా ప్రొడ్యూసర్‌పై పడ్డ వర్మ

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే లాక్‌డౌన్ సమయంలో క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలతో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్న వర్మ, రీసెంట్‌గా పవర్‌స్టార్ చిత్రంతో ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.

 Rgv To Make Movie On Allu Aravind, Rgv, Allu Aravind, Power Star, Murder, Tollyw-TeluguStop.com

పవన్ కళ్యాణ్‌పై తనదైన మార్క్‌లో సినిమాను తెరకెక్కించిన వర్మ, వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

కాగా వర్మ తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డట్లు తెలుస్తోంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌పై వర్మ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఇందులో అల్లు అరవింద్ ఫిలిం కెరీర్‌తో పాటు రాజకీయ జీవితం గురించి వర్మ మనకు చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నటీనటుల కోసం వర్మ ఇప్పటికే వేట కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

అయితే ఈసారి అల్లు అరవింద్‌పై వర్మ ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు విసురుతాడా అనేది చూడాలి.ఇటీవల ‘పవర్ స్టార్’ చిత్రంతో పవన్ రాజకీయ జీవితంపై వర్మ వేసిన సెటైర్, పవన్ అభిమానులకు నచ్చకపోవడంతో వారు వర్మపై దాడికి కూడా దిగారు.

మరి ఇప్పుడు వరుసగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న వర్మపై మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక తన సొంత ఏటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తూ వరుసగా విజయాలను అందుకుంటున్న వర్మ అల్లు అరవింద్‌పై తెరకెక్కిస్తున్న చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube