ఏపీలో పరీక్షలపై స్పందించిన ఆర్జీవి.. ముఖ్యమంత్రి జగన్ ను చిల్ అంటూ..?!

కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్వీట్లకు, సెటైర్లకు పదును మరింత పెట్టారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

 Rgv Responds On Tenth Class Exams In Ap, Ap 10th Exams, Rgv, Ram Gopal Varma, Cm-TeluguStop.com

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వివాదమైన పదో తరగతి పరీక్షలపై ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.అటు ప్రధాని మోడీ అమిత్ షాను కుంభమేళా ఎన్నికలు నిర్వహించినందుకు ట్విట్టర్ లో కడిగేశాడు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ పై కామెంట్స్ చేశారు.ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో పదో తరగతి పరీక్షలు వివాదాస్పదంగా మారాయి.

ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నాయి.ప్రతిపక్షాలు పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులను కరోనా వైరస్ బారిన పడకుండా చూడాలని కోరుతున్నాయి.

ఒకవేళ పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే 90 శాతం మంది స్టూడెంట్స్ సూపర్ హ్యాపీగా ఫీలవుతారు.ఎందుకంటే.90 శాతం సూడెంట్స్ నా మాదిరిగానే బ్యాడ్.వాళ్లందరూ ఎప్పుడూ పరీక్షలు వాయిదా పడాలని కోరుకొంటారు.

బుద్దిగా చదువుకొనే 10 శాతం మంది 90 శాతం మంది కింద పనిచేస్తారు.కాబట్టి చిల్ కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కు సలహా ఇస్తున్నాను అంటూ వర్మ ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ఒకవేళ కోవిడ్ బారిన పడుకుండా ఉంటారా.? లేదా ఏడాది స్టడీస్‌ ను కోల్పోతారా అనే ఛాయిస్ ఇస్తే.స్టూడెంట్స్ అందరూ మొదటి ఛాయిస్‌ కే ముగ్గుచూపుతారు.ఎందుకంటే వాళ్లకు స్టడీస్ కంటే.వారి లైఫ్ ముఖ్యమని భావిస్తారు అంటూ వర్మ తన వివరణ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ ను పణంగా పెట్టలేనని ఏపీ సర్కార్ పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్తున్నది.స్టూడెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.10 తరగతి పరీక్షల నిర్వహణపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube