వర్మ అన్‌ హ్యాపీ టీచర్స్‌ డే

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది అనడంలే సందేహం లేదు.ఆయన ప్రస్తుతం వరుసగా డిజిటల్‌ సినిమాలు చేస్తున్నాడు.

 Rgv Says About Un Happy Teachers Day, Rgv, Teachers Day, Un Happy Teachers Day T-TeluguStop.com

నేడు దిశా ఎన్‌ కౌంటర్‌ అనే సినిమాను వర్మ ప్రకటించాడు.ఇదే సమయంలో ఆయన నేడు టీచర్స్‌ డే సందర్బంగా విభిన్నంగా స్పందించాడు.

గతంలో కూడా టీచర్స్‌ డే ను అవహేళన చేసి విమర్శల పాలయిన వర్మ ఇప్పుడు మరోసారి తన నోటి దురుసు మొండి తనం మంకుతనంతో టీచర్స్‌ డే ను అగౌరవ పర్చాడు.అద్బుతమైన ఎంతో మంది గొప్ప టీచర్స్‌ ఉన్న ఈ సమాజంలో తన టీచర్స్‌ ఒక్కరు కూడా తనకు నచ్చలేదు అంటూ వర్మ చేసిన ట్వీట్‌ మరోసారి ఆయన తీరును చూపిస్తుంది.

ట్విట్టర్‌ లో వర్మ నేడు… నా టీచర్లు నాకు నచ్చలేదు.ఎందుకంటే నేను ఒక బ్యాడ్‌ స్టూడెంట్‌ను, నా అందరు టీచర్లు కూడా నా వల్ల ఎప్పుడు సంతోష పడ్డ సందర్బాలు లేవు.

అలాగే నేను కూడా వారికంటే ఎక్కవు వారి వల్ల సంతోష పడలేదు.అందుకే అన్‌ హ్యాపీ టీచర్స్‌ డే అటూ ట్వీట్‌‌ చేశాడు.వర్మ చేసిన ఈ ట్వీట్‌ కు మిశ్రమ స్పందన వస్తోంది.మీరు చెప్పింది కరెక్ట్‌ అంటూ కొందరు అంటూ ఉండగా మరి కొందరు నీవు దేవుడివి బాసూ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు మాత్రం నీవు ఈ స్థాయిలో ఉన్నావు అంటే గురువు లేకుండా సాధ్యం కాదు అంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది దర్శకులకు మరియు టెక్నీషియన్స్‌, నటీనటులకు వర్మ గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు.వారు మాత్రం వర్మను గురువుగా పూజిస్తూ ఉంటారు.వర్మకు మాత్రం అసలు గురువు అనే వ్యవస్తపై నమ్మకం ఆసక్తి ఉన్నట్లుగా అనిపించడం లేదు.

ఆయన తన వర్షన్‌ను చెప్పాడు.ఆయనను గురువుగా భావించే వారు కూడా ఉన్నారు కనుక ఆయన కూడా గొప్పవాడే అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube