ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్‌కు వర్మ వెయ్యి కోట్లు వచ్చే సలహా  

Rgv Suggests Rrr Team Ott Release - Telugu Att, Digital Platforms, Rajamouli, Ram Gopal Varma, Rgv Suggestion To Rrr Team, Rrr

తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన గొప్ప దర్శకుడు వర్మ.ఆమాటకు వస్తే ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు దక్కించుకున్న విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

 Rgv Suggests Rrr Team Ott Release

ఈయన ఈమద్య కాలంలో చిల్లర సినిమాలు తీస్తున్నాడు కాని ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌ చిత్రాలను తెరకెక్కించడం, అవార్డు సినిమాలను అందించడం చేశాడు.అయితే ఇప్పుడు కూడా ఇండియన్‌ సినిమాను కొత్త పుంతలు తొక్కించడం, మరియు కొత్త సాంకేతికతను అందించడం వంటివి చేస్తున్నాడు.

కాని ఈయన తీస్తున్న సినిమాలు మాత్రం నిరాశ పర్చుతున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్‌కు వర్మ వెయ్యి కోట్లు వచ్చే సలహా-Movie-Telugu Tollywood Photo Image

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈమద్య కాలంలో వస్తున్న సినిమాలు ఓటీటీ (ఏటీటీ) ప్లాట్‌ ఫామ్‌ మీద విడుదల అవుతున్నాయి.

తాజాగా ఎన్‌ఎన్‌ఎన్‌ చిత్రంను ఏటీటీ ద్వారా విడుదల చేసిన ఈయన ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి అండ్‌ టీంకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌ కోసం అద్బుతమైన ఒక ఐడియాను ఇచ్చాడు.వర్మ చెప్పినట్లుగా చేస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు విడుదలైన రెండు గంటల్లోనే వెయ్యి కోట్లు వస్తాయట.

వర్మ చెప్పేదాని ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఎవరు లేరు.డైరెక్ట్‌గా నిర్మాతనే సినిమాను విడుదల చేసుకోవచ్చు.దాంతో ఒక్క రూపాయి కూడా వేరే వాళ్లకు ఇవ్వకుండానే నేరుగా తన ఖాతాలో వేసుకోవచ్చు.రామ్‌ గోపాల్‌ వర్మ ఫిల్మ్‌ మేకర్స్‌కు కొత్త మార్గంను చూపుతున్నాడు.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని రెండు వందల నుండి నాలుగు అయిదు వందల రూపాయలను టికెట్టు రేటు పెట్టి మరీ విడుదల చేయవచ్చు.రాజమౌళికి ఉన్న క్రేజ్‌తో కేవలం రెండు గంటల్లోనే సినిమాకు వేయి కోట్లు వచ్చే అవకాశం ఉందని వర్మ అంటున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test