నాగార్జున అందానికి ఏమి తింటున్నాడో మరి: వర్మ

టాలీవుడ్ గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జున అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఈ పుట్టిన రోజు సందర్భంగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మట్విట్టర్ ద్వారా నాగార్జునకు శుభాకాంక్షలు తెలుపుతూ.

 Rgv Says Nagarjuna Looking Younger And Younger , Rgv Tweets,nagarjuna, Nag Birth-TeluguStop.com

అతని అంద చందాల గురించి ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆయన “నాగార్జున అందానికి ఏం తింటున్నారో గానీ, ఇలా ప్రతీ పుట్టిన రోజుకు అతగాడు నవ మన్మధుడిగా మారడం.

ఒకింత ఆశ్చర్యకరమే.ఈ అందం ఇప్పటి యాంగ్ స్టార్లకు ఎసరు పెట్టడం ఖాయం.” అంటూ రాసుకొచ్చారు.

ఇంకా పేర్కొంటూ.“నాగార్జున గారు.మీరు ఏమి తింటున్నారో నాకు చెబితే నేను కూడా ట్రై చేస్తా.

అలాగే మీరు పూజిస్తున్న ఇష్టదైవం పేరుకూడా చెప్పండి.నేను కూడా దండం పెట్టుకుంటా.

ఇలా ప్రతి పుట్టిన రోజుకి మీరు యంగ్ అయిపోతే యెట్లా.యూత్ సినిమాలలో నటించొద్దా?” అని చమత్కరించారు.ఆ తరువాత నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మెసేజ్ చదివిన కింగ్ నాగార్జున ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అలాగే ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ విడుదల అవడంతో, చిత్ర బృందానికి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం షూటింగ్ కు సిద్ధం అవుతున్నానంటూ ట్వీట్ చేశారు.

ఇకపోతే నాగార్జున ఈ రోజుతో 61వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికి తెలిసిందే.దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube