పవన్‌కు షాక్‌ ఇచ్చిన వర్మ

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై ఎన్నో వందల ట్వీట్స్‌ చేసి ఉంటాడు రామ్‌ గోపాల్‌ వర్మ.ఈ వివాదాల దర్శకుడు ట్వీట్స్‌ చేయడం కొత్తేం కాదు, అవి వివాదాస్పదం అవ్వడం అసలే కొత్త కాదు.

కాని పవన్‌ గురించి వర్మ చేసిన ట్వీట్స్‌ పతాక స్థాయికి చేరుకున్నాయి.కొన్ని విమర్శలు చేస్తూ, మరి కొన్ని ప్రశంసలు ఉన్నాయి.

పవన్‌ గురించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను చెబుతూ వస్తున్న రామ్‌ గోపాల్‌ వర్మ ఇకపై తన ట్విట్టర్‌ పేజ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేరు కనిపించదు.తాజాగా ఈ విషయాన్ని రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా ప్రకటించాడు.

తాను పవన్‌ గురించి ట్వీట్స్‌ చేయను అంటూ ప్రకటించాడు.

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ వర్మ ట్వీట్స్‌ నాకు నవ్వు తెప్పిస్తాయి అని, ఆయన ప్రస్టేషన్‌లో అలా ట్వీట్స్‌ చేస్తున్నాడు అంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

దాంతో పాటు వర్మ ట్వీట్స్‌పై కొంత కాలంగా పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు.దాంతో ఇకపై ట్విట్టర్‌లో పవన్‌పై ట్వీట్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లుగా వర్మ ప్రకటించాడు.

తాను ఇకపై పవన్‌ గురించిన ట్వీట్స్‌ చేయను అని, ఇదే పీకే గురించిన చివరి ట్వీట్‌ అని, గుడ్‌ బై పవన్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.వర్మను అంతగా నొప్పించిన విషయం ఏంటి, పవన్‌ గురించిన ట్వీట్స్‌ ఎందుకు చేయనన్నాడు అనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.

వర్మ మళ్లీ తన మనస్సు మార్చుకుని పవన్‌పై ట్వీట్స్‌ చేస్తాడో లేక పర్మినెంట్‌గా పవన్‌ పేరును మర్చి పోతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube