పవన్ కల్యాణ్‌కు కరోనాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

 Rgv Shocking Comments On Pawan Kalyan Corona-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అయితే పవన్ కు కరోనా సోకడంపై వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న తరుణంలో కంటికి కనిపించని పురుగు స్టార్ హీరో పవన్ ను దయనీయ స్థితిలో పడుకోబెట్టిందని ఇలా జరిగితే హీరో అనే వస్తువు ఉన్నట్లా ? లేనట్లా ? యువర్ ఆనర్ అంటూ ఆర్జీవీ వకీల్ సాబ్ సినిమాపై సెటైర్లు పేల్చారు.వకీల్ సాబ్ సినిమాకు వస్తున్న కలెక్షన్లే పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితికి కారణమని ఇతర హీరోల ఫ్యాన్స్ అంటున్నారని ఆర్జీవీ పేర్కొన్నారు.

 Rgv Shocking Comments On Pawan Kalyan Corona-పవన్ కళ్యాణ్ కు కరోనాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమా చూసి పవన్ జేబులు నింపాలని ఆర్జీవీ సూచనలు చేశారు.వర్మ ఈ వివాదంలోకి దర్శక ధీరుడు రాజమౌళిని కూడా లాగారు.పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో యొక్క ఆర్ట్ డైరెక్షన్ లో ఒక తప్పు ఉందని ఆర్జీవీ పేర్కొన్నారు.బాహుబలి సిరీస్ సినిమాలకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో ఆ తప్పేంటో చెప్పించాలని ఆర్జీవీ కామెంట్లు చేశారు.

ఇతర హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడం ఫేక్ అని అంటున్నారని అలా కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్ అంటున్నారని వారి ఆట కట్టించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా తాను ఛాలెంజ్ విసిరానని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

#Corona Positive #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు