ఐకాన్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ..అలా చేయలేరంటూ..!

ఒకప్పుడు మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఆర్జీవీ. కానీ ఇప్పుడు అన్ని బి గ్రేడ్ సినిమాలు తీస్తూ వరస ప్లాప్స్ అందుకోవడమే కాకుండా వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరో ఒకరి  మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

 Rgv Sensational Comments On Allu Arjun Pushpa Movie Trailer Details, Allu Arjun,-TeluguStop.com

అవసరం ఉన్న లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.

రీసెంట్ గా విడుదల అయినా పుష్ప ట్రైలర్ ను చూసిన ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు.అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.

ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల అవుతున్న సందర్భంగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అయ్యింది.

ఈ ట్రైలర్ ను చూసిన ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసాడు.

టాలీవుడ్ లో భయంలేని హీరో అంటే అల్లు అర్జున్ మాత్రమే అంటూ ఆర్జీవీ తెలిపాడు.ఇక పుష్ప లాంటి పాత్రలు అల్లు అర్జున్ కాకుండా మరెవరూ చేయలేరు అని పేర్కొన్నాడు.రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్ఫెక్ట్ అని.చిరంజీవి, మహేష్ బాబు, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పుష్పరాజ్ లాంటి పాత్ర చేయలేరని వారందరిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేసాడు.

అంతేకాదు ఇలాంటి పాత్రలు మీరందరు చేయగలరా అని వారికీ సవాల్ విసిరాడు.ప్రెసెంట్ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంకా చివరిగా అల్లు అర్జున్ డైలాగ్ కూడా యాడ్ చేసాడు.పుష్ప అంటే ఫ్లవర్ కాదు.ఫైర్ అంటూ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక పుష్ప సినిమా నుండి వచ్చిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది.

ఈ సినిమా కోసం అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube