ఆర్జీవీ ట్వీట్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన అతనిని ఫాలో అయ్యేవారే కాకుండా చాలా మంది ఆసక్తిగా చూస్తారు.అతను చేసిన ట్వీట్లు ఈ కారణంగానే వైరల్ అవుతూ ఉంటాయి.

 Rgv Sensational Comments On Nomula Bhagath In Twitter , Nagarjuna Sagar Bypoll,-TeluguStop.com

సినిమాల గురించి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా ఆర్జీవీ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు.అయితే అతని ట్వీట్స్ లో చాలా వరకు ఎటకారం కనిపిస్తుంది.

ముఖ్యంగా తనని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, కాయకులకి మరింత మండేలా కామెంట్స్ చేస్తూ ఉంటాడు.అలాగే ఆ మధ్య గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తన పెంపుడు కుక్కకి ఫుడ్ తినిపిస్తున్న ఫోటోని షేర్ చేసి తనకి వచ్చే జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా పుడతానని ఫన్నీ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్ టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగాడు.

ఈ సమయంలో గతంలో అతనికి సంబందించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే తాజాగా భగత్ ఏకంగా చిరుతపులితో వాకింగ్ చేస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి బయటకొచ్చింది.

దీనిని ఆర్జీవీ షేర్ చేయడంతో పాటు ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.వామ్మో మనం ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ లను పులి, సింహం అని భావించాం.

కానీ చిరుతపులితో వాకింగ్ చేస్తున్న ఈ కాండిడేట్ నోముల భగత్ మామూలోడు కాదు.అతడ్ని నేను ఇష్టపడుతున్నాను.

నాగార్జునసాగర్ లో గనుక నాకే గనుక ఓటు ఉంటే నా ఓటు నిస్సందేహంగా నోముల భగత్ కే అని వర్మ స్పష్టం చేశారు.ప్రపంచ చరిత్రలో ఇలా చిరుతపులిని పట్టుకుని ప్రచారం చేస్తున్న నేతను ఎక్కడా చూడలేదు.

హ్యాట్సాఫ్ టు కేసీఆర్, కేటీఆర్ అంటూ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఈ ట్వీట్ తో పులితో వాకింగ్ చేస్తున్న నోముల భగత్ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో భగత్ హిస్టరీ తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube