‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్లాప్‌ అయితే ఏం జరుగబోతుందో చెప్పిన వర్మ  

Rgv Rrr Rajamouli - Telugu Coronavirus, Lock Down, Rajamouli, Rgv, Rgv Cinima Shooting, Rrr, Rrr Flop

రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన ‘క్లైమాక్స్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఈరోజు రాత్రి 9 గంటకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Rgv Rrr Rajamouli

వంద రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకుని సినిమా చూడవచ్చు.ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ను భారీ ఎత్తున నిర్వహించిన వర్మ తాజాగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఈ సందర్బంగా రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి అంతా ఇంట్లో ఉండి పనులు చేసుకోమని సూచించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్లాప్‌ అయితే ఏం జరుగబోతుందో చెప్పిన వర్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నా పని సినిమా మేకింగ్‌.అది నేను ఇంట్లోనే ఉండి చేశాను.అందులో నాకు ఎలాంటి తప్పు అనిపించడం లేదు.

చాలా మంది ఇల్లు తూడ్చడం, బట్టలు పిండటం, వంట చేయడం చేశారు.కాని నేను అలా చేయకుండా సినిమా చేశాను.

ఎవరి పని వారు చేశారు.నా పని నేను చేశానంటూ తనదైన శైలిలో స్పందించాడు.

ఇక వర్మ మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫ్లాప్‌ కోసం కొందరు ఎదురు చూస్తున్నారంటూ కామెంట్‌ చేశాడు.

రాజమౌళి ఒక్క సినిమా అయినా ఫ్లాప్‌ అయితే చూడాలని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక వేళ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఫ్లాప్‌ అయితే మాత్రం చాలా మంది రోడ్ల మీదకు వచ్చి డాన్స్‌ చేస్తారు.కొందరు మద్యంలో స్నానం చేసినట్లుగా పార్టీ చేసుకుంటారు.

అంతగా రాజమౌళిపై అసూయతో సినీ జనాలు ఉన్నారంటూ వర్మ పేర్కొన్నాడు.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Rrr Rajamouli Related Telugu News,Photos/Pics,Images..

footer-test