ఫుల్ జోష్‌లో ఉన్న వర్మ.. పవన్‌తో పాటు చిరు కూడా వచ్చేశాడుగా!  

RGV Releases Power Star Still Of Pawan Kalyan Chiranjeevi, RGV, Pawan Kalyan, Chiranjeevi, Power Star, Tollywood News - Telugu Chiranjeevi, Pawan Kalyan, Power Star, Rgv, Tollywood News

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది.ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు ఈ డైరెక్టర్.

 Rgv Releases Power Star Still Of Pawan Kalyan Chiranjeevi

ఇటీవల క్లైమాక్స్, నగ్నం సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న వర్మ, ప్రస్తుతం ‘పవర్‌స్టార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఫుల్ జోష్‌లో ఉన్న వర్మ.. పవన్‌తో పాటు చిరు కూడా వచ్చేశాడుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పవన్ కళ్యాణ్ పోలికతో ఉన్న వ్యక్తితో ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌ను పెట్టి ఈ సినిమా తీస్తుండటంతో వర్మపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన కొద్దిసేపటికే మరో స్టిల్‌ను రిలీజ్ చేశాడు వర్మ.ఈ ఫోటోలో పవన్‌తో పాటు చిరంజీవిని పోలి ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు.

మొత్తానికి ఈసారి పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీపై వర్మ తనదైన మార్క్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో చిరు పవన్ పక్కపక్కన ఉన్న ఈ ఫోటో ఏ సందర్భంలో వస్తుందో చూడాలి.
అయితే పవన్ కథను ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తీస్తేనే తాము సినిమాను రిలీజ్ చేయనిస్తామని పవన్ ఫ్యాన్స్ వర్మను హెచ్చరిస్తున్నారు.కానీ తనకు తోచిన విధంగా సినిమా తీస్తానని, ఎవ్వరు అడ్డుపడినా సినిమాను రిలీజ్ చేస్తానని గతంలోనే వర్మ చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక వర్మ స్పీడును చూసి మిగతా దర్శకుడు అవాక్కవుతున్నారు.ఇంత త్వరగా ఆయన సినిమాను ఎలా తీస్తున్నాడా అని వారు ముక్కునవేలేసుకుంటున్నారు.

#Chiranjeevi #Pawan Kalyan #Power Star #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Releases Power Star Still Of Pawan Kalyan Chiranjeevi Related Telugu News,Photos/Pics,Images..