ఆర్జీవి ఓవర్ యాక్షన్! రోడ్డు మీద ప్రెస్ మీట్  

విజయవాడలో రోడ్డు మీద ప్రెస్ పెడుతున్న ఆర్జీవి. .

Rgv Press Meet On Road In Vijayawada-press Meet,rgv,road In Vijayawada,telugu Cinema,tollywood

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అయ్యి నోవోటెల్ బుక్ చేసారు. అయితే ఆర్జీవి బుకింగ్ ని హోటల్ రద్దు చేసింది. దీంతో ఆర్జీవి తన పబ్లిసిటీ స్టంట్ పదును పెట్టాడు..

ఆర్జీవి ఓవర్ యాక్షన్! రోడ్డు మీద ప్రెస్ మీట్-RGV Press Meet On Road In Vijayawada

ఇక ఆలోచన వచ్చిందే అదునుగా రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్న అని సోషల్ మీడియా లో ప్రకటించేసాడు.

ఓ వ్యక్తికి భయపడి హోటల్ నిర్వాహకులు తన ప్రెస్ మీట్ కి అనుమతి ఇవ్వలేదని, అందుకే తాను నేరుగా రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్న అని స్పష్టం చేసాడు. ఈ ప్రెస్ మీట్ కి నా మీద అభిమానం ఉన్న అందరూ రావొచ్చని ఆర్జీవి ట్వీట్ చేసాడు.

ఇదిలా ఉంటే అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటికే సినిమాని చాలా మంది చూసేసి ఎవరేజ్ మార్కులు ఇచ్చారు. అలాంటి సినిమాని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఆర్జీవి ప్లే చేస్తున్న గేమ్ ని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.