టీడీపీకి చుక్కలు చూపిస్తున్న ఆర్జీవి! లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు.  

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ ఆపాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ. .

  • ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని తీసుకొని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఎన్నికల ముందు చంద్రబాబుకి వ్యతిరేకంగా వున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ వుండటం టీడీపీ శ్రేణులని కొంత కలవరపాటుకి గురిచేస్తుంది. ఇక తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ఇలాంటి టైంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే కచ్చితంగా అది చంద్రబాబుపై ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.

  • అయితే వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే వర్మ మాత్రం చంద్రబాబుని, టీడీపీని వదలకుండా అధిపనిగా రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు. తాజాగా సోషల్ మీడియాలో చంద్రబాబు మీద మోడీ చేసిన వాఖ్యలని తన సినిమా ప్రమోషన్ కోసం ఆర్జీవి వాడుకున్నాడు. అలాగే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టి ఎన్నికలలో టీడీపీపై లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటూ ప్రమోషన్ చేసుకున్నాడు. ఇక పోల్ రిజల్ట్ కూడా షేర్ చేసి టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. అలాగే టీడీపీ పార్టీ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిలిపేయాలని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా షేర్ చేసాడు. మొత్తానికి ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టీడీపీకి ఆర్జీవి చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పాలి.