‘పవర్‌స్టార్‌’ ట్రైలర్ టాక్: ఫ్యాన్స్‌కు గట్టిగా ఇచ్చేసిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పవర్ స్టార్’ ఇప్పటికే ఎలాంటి వివాదాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ ఓ సినిమా చేస్తున్నాడనే విషయం అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ పవన్ ఫ్యాన్స్ వర్మపై విరుచుకుపడుతున్నారు.

 Rgv Powerstar Trailer Leaked Online, Rgv, Ram Gopal Varma, Powerstar, Pawan Kaly-TeluguStop.com

దీంతో వర్మ మరింత రెచ్చిపోయి ఈ సినిమాపై ఫోకస్ పెట్టాడు.అనౌన్స్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి కూడా చేశాడు ఈ డైరెక్టర్.

అందరికీ షాకిస్తూ ఈ సినిమాను తన ఏటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించిన వర్మ, ఈ సినిమా ట్రైలర్‌కు కూడా రేటును ఫిక్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.ఇక జూలై 22న ఉదయం 11 గంటలకు ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తానని వర్మ అనౌన్స్ చేశాడు.

కానీ ఈలోపే ఈ సినిమా ట్రైలర్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యింది.ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే, వర్మ మరోసారి తన మార్క్‌ను వేసుకున్నాడనే చెప్పాలి.పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమిపాలైన దగ్గర్నుండి ఈ సినిమాలో కథ నడుస్తుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.ఇందులో ప్రవన్(పవన్ కళ్యాణ్) ఓటమిని జీర్ణించుకోలేక పోవడం, ఆయన పడే మనోవేదన, ఆయన చుట్టూ చేరి కొంత మంది ఇచ్చే సలహాలు, సూచనలకు ఆయన ఎలా స్పందించాడు అనే అంశాలను వర్మ మనకు చూపించనున్నాడు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.పవర్ స్టార్ ‘ఫ్యాన్స్’ను నమ్మి ఎలా ఓటమిపాలయ్యాడో అనే అంశంపై వర్మ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరి వర్మ టార్గెట్ చేసి ఈ ఫ్యాన్స్ పవర్ స్టార్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.మొత్తానికి వర్మ మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను గెలికాడనేది వాస్తవమని ఈ ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న ఈ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube