పవర్‌స్టార్ వాకౌట్.. డోంట్ కేర్ అంటోన్న వర్మ!  

RGV Power Star Actor Walks Out Of The Movie, RGV, Power Star, Pawan Kalyan, Ram Gopal Varma - Telugu Pawan Kalyan, Power Star, Ram Gopal Varma, Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు.ఓటీటీల పుణ్యమా అని వర్మ చేస్తున్న సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఆయన తన సినిమాల స్పీడును పెంచాడు.

 Rgv Power Star Pawan Kalyan Ram Gopal Varma

ఇప్పటికే లాక్‌డౌన్ సమయంలో క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలను రిలీజ్ చేసిన వర్మ, తాజాగా మరికొన్ని సినిమాలను క్యూలో పెట్టాడు.ఇందులో అందరి దృష్టిని రాబట్టిన చిత్రంగా ‘పవర్ స్టార్’ నిలిచింది.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంపై వర్మ తనదైన మార్క్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.పవన్‌ను పోలి ఉన్న వ్యక్తితో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వర్మ ఇటీవల ప్రకటించాడు.

పవర్‌స్టార్ వాకౌట్.. డోంట్ కేర్ అంటోన్న వర్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్న సంగతి తెలిసిందే.అయినా తాను మాత్రం ఈ సినిమా చేసి తీరుతానంటున్నాడు వర్మ.

అయితే ఈ సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ డూప్, ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.కారణాలు ఏవైనా, తాను ఈ సినిమాలో నటించబోనని వర్మతో తేల్చి చెప్పాడట ఆ హీరో.

దీంతో పవర్ స్టార్ చిత్రం ఆగిపోయిందా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.కానీ వర్మ ఇలాంటి వార్తలకు ఏమాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు.గతంలోనూ ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా తాను అనుకున్న విధంగా సినిమాలను తెరకెక్కించి రిలీజ్ చేసిన వర్మ, కేవలం పవన్ డూప్ సినిమా నుండి వాకౌట్ చేసినంత మాత్రాన సినిమాను ఆపేస్తాడనుకోలేము.పవన్ లాంటి మరో వ్యక్తిని వెతికిపట్టకొచ్చి తన సినిమాను పూర్తి చేయగలడు ఈ డైరెక్టర్.

ఏదేమైనా వర్మ మరోసారి ఈ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాలని చూస్తున్నాడు.

#Power Star #Ram Gopal Varma #RGV #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Power Star Pawan Kalyan Ram Gopal Varma Related Telugu News,Photos/Pics,Images..