పవర్ స్టార్‌కు జైకొట్టి దించేసిన వర్మ  

RGV Power Star Movie First Look Released, RGV, Power Star, Tollywood News, Ram Gopal Varma - Telugu Power Star, Ram Gopal Varma, Rgv, Tollywood News

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.సినిమా అనౌన్స్ చేసిన కొన్ని రోజుల్లోనే దాన్ని రిలీజ్ చేయడంలో దిట్ట అయిన వర్మ, ఇటీవల మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం అనే సినిమాలు చేసి రిలీజ్ కూడా చేశాడు.

 Rgv Power Star Movie First Look Released

ఇక ఈ సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా క్యూలో పెట్టాడు.ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేసిన వర్మ, దాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.అసలు వర్మ ఇంత స్పీడుగా సినిమాలు ఎలా చేస్తాడా అని అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

పవర్ స్టార్‌కు జైకొట్టి దించేసిన వర్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా ‘పవర్‌స్టార్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వర్మ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను పోలిన వ్యక్తిని మనకు చూపించాడు వర్మ.2019 ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన ఘటనల ఆధారంగా వర్మ ఈ సినిమాకు తెరకెక్కిస్తు్న్నట్లు పేర్కొన్నాడు.మొత్తానికి మరో సంచలన చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో వర్మ ఉన్నాడని ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

కాగా ‘పవర్‌స్టార్’ చిత్ర పోస్టర్‌పై పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.తమ అభిమాన హీరో కథను వర్మ వక్రీకరించి చూపుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పవన్ రాజకీయ జీవితంపై వివాదం సృష్టించేందుకే వర్మ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని జనసైనికులు మండి పడుతున్నారు.ఇక ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

మరి ‘పవర్‌స్టార్’ చిత్రంతో వర్మ ఎలాంటి వివాదాలకు తెరలేపుతాడో చూడాలి.

#Ram Gopal Varma #RGV #Power Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Power Star Movie First Look Released Related Telugu News,Photos/Pics,Images..