పిచ్చోడి చేతిలో రాయిలా వర్మ చేతిలో ఏటీటీ  

Rgv Power Star Movie Att Release - Telugu Att, Att Release, Digital Release, Industry, Murder, Nagnam, Power Star, Rgv, Three Movies

కొన్నాళ్ల క్రితం రామ్‌ గోపాల్‌ వర్మ ఏ సినిమా తీసినా కూడా సెన్సార్‌ సమస్యలు వచ్చేవి.తన క్రియేటివిటీని సెన్సార్‌ వారు కిల్‌ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా అడ్డు అదుపు లేకుండా మారిపోయాడు.

 Rgv Power Star Movie Att Release

డిజిటల్‌ ఫార్మట్‌లో సినిమాల విడుదలకు ఛాన్స్‌ దక్కడం, దాంతో భారీగా డబ్బులు వస్తున్న కారణంగా వర్మ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు.ఆ సినిమాలను డిజిటల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం వర్మ మూడు సినిమాలు చేస్తున్నాడు.

పిచ్చోడి చేతిలో రాయిలా వర్మ చేతిలో ఏటీటీ-Movie-Telugu Tollywood Photo Image

సెన్సార్‌ వారు ఏమాత్రం ఒప్పుకోని మర్డర్‌ సినిమాను వర్మ అమృత ప్రణయ్‌ల జీవిత కథతో తెరకెక్కిస్తున్నాడు.

ఇక రామ్‌ గోపాల్‌ వర్మ నిన్న ‘పవర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని కూడా అనౌన్స్‌ చేశాడు.పవన్‌ కళ్యాణ్‌ కథాంశంతో ఆ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు.

ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది.వర్మ ఎనీ టైమ్‌ థియేటర్‌ (ఏటీటీ) ద్వారా తాజాగా ఎన్‌ఎన్‌ఎన్‌ చిత్రంను విడుదల చేశాడు.

ఆ సినిమాకు పెట్టింది అయిదు లక్షలు అయితే కోటి నుండి కోటిన్నర వరకు వచ్చే అవకాశం ఉంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పవర్‌ స్టార్‌ చిత్రంలో వర్మ ఏం చూపించబోతున్నాడో అంటూ ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో రష్యన్‌ నటితో పాటు నాలుగు ఆవులు బర్రెలు కూడా ఉంటాయని వర్మ చెప్పడంతో సినిమా చాలా రసవత్తరంగానే వర్మ తీస్తాడని అంటున్నారు.ఇన్ని రోజులు థియేటర్ల సెన్సార్‌ ఇష్యూ కారణంగా ఆగిన వర్మ ఇప్పుడు ఏటీటీ ద్వారా విడుదల ఛాన్స్‌ ఉంది కనుక అన్ని వివాదాస్పద అంశాలను చూపించే అవకాశం ఉంది.

అందుకే వర్మ చేతిలో ఏటీటీ పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా మారిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Power Star Movie Att Release Related Telugu News,Photos/Pics,Images..

footer-test