నేను కోబ్రా అంటున్న ఆర్జీవి! మరో సారి సంచలనం  

హీరోగా నటించడానికి రెడీ అవుతున్న ఆర్జీవి. .

Rgv Play Hero Role In His Next Movie-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడు అనేది అంత వేగంగా అర్ధం కాదు.ఏదో చేస్తాడని అందరూ అనుకునేలోపే ఊహించని విధంగా తన నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురి చేస్తాడు.అందుకే ఆర్జీవి నిర్ణయాలు ఎప్పుడు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి..

Rgv Play Hero Role In His Next Movie--RGV Play Hero Role In His Next Movie-

తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీ రాజకీయాలలో ఆర్జీవి సంచలనాలకి కేంద్ర బిందువుగా మారారు.ఇక తాజాగా తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారిన జయలలిత సన్నిహితురాలు శశికళ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే ఆర్జీవి తాజాగా మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటి వరకు దర్శకుడుగా సత్తా చాటిన ఆర్జీవి నటుడుగా కూడా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఓ సినిమాలో హీరోగా నటించనున్నారు.ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

కోబ్రా అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు.ఇప్పటిదాకా ఎన్నో సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వచించిన ఆయన ఇప్పుడు ఆ బాధ్యత తోపాటు హీరో బాధ్యతను కూడా నెత్తినేసుకున్నారు.మరి ఆ కోబ్రాతో ఆర్జీవి ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.