తులసిదళం'కి సీక్వెల్ గా తుమ్మలపల్లి నిర్మాతగా ఆర్జీవి చిత్రం 'తులసితీర్థం'

మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన “తులసీదళం” నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ తో స్టార్ రైటర్ గా నీరాజనాలందుకుని మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి తాజాగా “తులసితీర్ధం” తీర్చిదిద్దారు.

 Rgv Next Movie With Producer Tummalapalli Named Tulasiteertham A Sequel To Tulasidalam-TeluguStop.com

కాన్సెప్ట్ పరంగా ఇది ‘తులసిదళం”కు సీక్వెల్ కానుంది.

ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో మొదటిసారి… వేరే రచయిత సమకూర్చిన కథతో సినిమా రూపొందించేందుకు అంగీకరించారు.

 Rgv Next Movie With Producer Tummalapalli Named Tulasiteertham A Sequel To Tulasidalam-తులసిదళం’కి సీక్వెల్ గా తుమ్మలపల్లి నిర్మాతగా ఆర్జీవి చిత్రం తులసితీర్థం’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిత్రం పేరు “తులసి తీర్ధం”.

భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ “రేర్ కాంబినేషన్” చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రాఫిక్స్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి!!

.

#Tummalapalli #Horror Thriller #Tulasiteertham #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube