ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెబుతానంటోన్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసబెట్టి వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ తనదైన మార్క్‌ను వేస్తున్నాడు.అటు బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ వరుసబెట్టి రిలీజ్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

 Rgv Next Movie On Balakrishna, Ram Gopal Varma, Rgv, Balakrishna, Tollywood News-TeluguStop.com

కాగా ప్రస్తుతం నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తనదైన శైలిలో ఓ సినిమా చేస్తున్నాడు వర్మ.‘పవర్‌స్టార్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కాగా పవర్‌స్టార్ చిత్రాన్ని తనకు చెందిన ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరువాత మరో నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణపై వర్మ ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడట.

‘ఆ రోజు రాత్రి ఏం జరిగింది?’ అనే టైటిల్‌తో ఈ సినిమాను వర్మ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.అయితే గతంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై బాలయ్య కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

ఈ ఘటన ఆధారంగా వర్మ తనదైన స్టయిల్‌లో సినిమా తీసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

ఏదేమైనా ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించాలంటే అది వర్మకే సాధ్యమని పలువురు అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే బాలయ్యను పోలి ఉంటే వ్యక్తి దొరికాడని, ఆయనతో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఏదేమైనా పవన్ కళ్యాణ్ తరువాత వర్మ గురి బాలయ్య వైపు పడటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube