వర్మ ‘మర్డర్‌’ వచ్చే నెలలో ఖాయం  

RGV, Amrutha Pranay Love Story, Murder Movie, RGV Murder Movie, Digital Release - Telugu Amrutha Pranay Love Story, Digital Release, Murder Movie, Rgv, Rgv Murder Movie

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గత నెలలో అమృత ప్రణయ్‌ల ప్రేమ కథను ‘మర్డర్‌’ అంటూ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా ఇప్పటికే మొదలు పెట్టాడు.

 Rgv Murder Release Amrutha Pranay Story

హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌తో పాటు నల్లగొండ మిర్యాలగూడెంలలో కూడా సినిమా షూటింగ్‌ను జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.సినిమా షూటింగ్‌ హడావుడి లేకుండా చకచక పూర్తి చేస్తున్నాడు.

ఈనెలలోనే సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

వర్మ ‘మర్డర్‌’ వచ్చే నెలలో ఖాయం-Movie-Telugu Tollywood Photo Image

ఇటీవల వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా కేవలం రెండు రోజులు మాత్రమే చిత్రీకరణ చేశారు.ఆ సినిమా షూటింగ్‌ను వర్మ చాలా టెక్నిక్‌గా అద్బుతంగా చేశాడు.ఇండియాలోనే దిబెస్ట్‌ ఫిల్మ్‌ టెక్నీషియన్‌గా గుర్తింపు దక్కించుకున్న వర్మ మర్డర్‌ చిత్రాన్ని కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాడని నెటిజన్స్‌ భావిస్తున్నారు.

వర్మ మర్డర్‌ చిత్రం విడుదల విషయంలో అవాంతరాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అయితే ఎంతో పెద్ద వివాదాలను కూడా కొట్టి పారేస్తూ వచ్చి సినిమాలను విడుదల చేసుకున్న ఘటికుడు వర్మ.

అలాంటి వర్మకు మర్డర్‌ సినిమా విడుదల చేయడం పెద్ద కష్టం ఏమీ కాదని, అది కూడా ఈయన డిజిటల్‌లో విడుదల చేస్తున్నాడు కనుక వర్మ దేన్ని కూడా పట్టించుకోక పోవచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది.మరి మర్డర్‌ చిత్రంలో వర్మ చూపించబోతున్నది ఏంటీ, అమృత ఎలా దీనిపై రియాక్ట్‌ అవ్వబోతుంది అనేది చూడాలి.

#Digital Release #RGV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Murder Release Amrutha Pranay Story Related Telugu News,Photos/Pics,Images..