మర్డర్‌ విషయంలో వర్మ వెనక్కు తగ్గాడా?  

RGV Back Step In Murder Movie, RGV, Murder, Amrutha, Pranay, Police Case, Maruthi Rao, Nalgonda, Miryalagudem, - Telugu Amrutha, Maruthi Rao, Miryalagudem, Murder, Nalgonda, Police Case, Pranay, Rgv

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్శియల్‌ సినిమాలు తెరకెక్కించాడు.కోర్టులు, సుప్రీం కోర్టులు హెచ్చరించినా లా లో ఉన్న లొసుగులతో తన సినిమాలను విడుదల చేసిన ఘనత ఆయనది.

TeluguStop.com - Rgv Murder Amrutha Pranay Police Case

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాంటిది ఇప్పుడు ఆయన చేస్తున్న మర్డర్‌ సినిమా విషయంలో పోలీసుల హెచ్చరికలను ఆయన పట్టించుకుంటాడా అంటున్నారు.రామ్‌ గోపాల్‌ వర్మ మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య గురించి సినిమా తీస్తున్న విషయం తెల్సిందే.

TeluguStop.com - మర్డర్‌ విషయంలో వర్మ వెనక్కు తగ్గాడా-Movie-Telugu Tollywood Photo Image

ఆ విషయమై అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నల్లగొండ జిల్లా పోలీసులు రంగంలోకి దిగి వర్మకు నోటీసులు పంపించారు.

వర్మ ఆ నోటీసులకు భయపడ్డాడా లేదంటే మరేదైనా నిర్ణయం మార్చుకున్నాడో అర్థం కావడం లేదు.

కాని మర్డర్‌ సినిమా విషయంలో ఆయన హడావుడి కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తుంది.ఆమద్య ట్రైలర్‌ ఆ తర్వాత పాటను విడుదల చేసిన వర్మ అంతా అనుకున్నట్లుగా జరిగితే నిన్న శుక్రవారం సందర్బంగా మర్డర్‌ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది.

పోలీసుల హెచ్చరికలు పని చేసి సినిమాను వాయిదా వేసి ఉంటాడు అంటున్నారు.అమృత మారుతి రావుల కథను ఇందులో చూపించాడు.

తండ్రి కూతురు కథ అంటూనే ఎవరికి ఈ కథతో సంబంధం లేదు.పూర్తిగా కల్పితం అంటున్నాడు.కనుక సినిమాకు క్లియరెన్స్‌ వస్తుందనుకున్నారు.అయినా డిజిటల్‌ సినిమా కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల అవుతుందేమో అనుకున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే పోలీసులు ఇప్పుడు వర్మను ఇరుకున పెట్టారు.పోలీసుల నోటీసుల వల్ల వర్మ మర్డర్‌ సినిమాను పక్కకు పెట్టి థ్రిల్లర్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే నిర్ణయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

#Nalgonda #Pranay #Amrutha #Miryalagudem #Murder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Murder Amrutha Pranay Police Case Related Telugu News,Photos/Pics,Images..