రామ్ గోపాల్ వర్మ తాజాగా రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఆ రెండు సినిమాలు కూడా డిజిటల్ లో విడుదల చేసిన విషయం తెల్సిందే.
వర్మ రెండు సినిమాల బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువ.మొదట క్లైమాక్స్ సినిమాను పది హేను లక్షల లోపు బడ్జెట్తో పూర్తి చేసిన వర్మ తాజాగా నగ్నం సినిమాను పది లక్షల లోపు బడ్జెట్తో పూర్తి చేసిన వర్మ రెండు సినిమాలను కూడా పాతిక లక్షల లోపులోనే పూర్తి చేశాడట.
ఈ రెండు సినిమాలతో వర్మ ఏకంగా అయిదు కోట్ల వరకు ఆదాయాన్ని సొంతం చేసుకుని ఉంటాడు అనేది ట్రేడ్ వర్గాల టాక్.ఈ రెండు సినిమాలను కూడా డిజిటల్లో టికెట్లు పెట్టి మరీ విడుదల చేశాడు.
కనుక రెండు సినిమాలను చూసేందుకు లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి మరి చూశారు.క్లైమాక్స్ సినిమాకు వంద టికెట్లు పెట్టిన వర్మ నగ్నం సినిమాకు మాత్రం ఏకంగా రెండు వందల టికెట్టు పెట్టాడు.
దాంతో భారీ ఎత్తున వర్మ లాభాన్ని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.