పిచ్చోడి చేతిలో రాయి అంటూ ఉంటారు.ఆ రాయి ఎవడికి ఎక్కడ తగులుతుందో తెలియదు కాబట్టి వాడు చేతిలో ఉన్నంత సేపు భయపడాల్సిందే.
మరి ఇలాంటి వాటికి ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) చేతిలో సినిమా.ఆయన హిట్టు కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆయనకైనా గుర్తుందో లేదో కానీ జనాలు మాత్రం ఆయన సినిమా వస్తుంది అని మర్చిపోవడం మొదలు పెట్టారు.
అసలు వర్మ సినిమాలు ఎందుకు తీస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందా అంటే అది అనుమానమే.కేవలం హీరోయిన్స్ తో పిచ్చి డాన్సులు వేయడానికి మాత్రమే సినిమాలు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది.
పొరపాటున సినిమాలో డాన్స్ అనుకునేరు.షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం క్లబ్ లో చేసే డ్యాన్స్ గురించి ఈ మాట చెబుతోంది.

రక్త చరిత్ర సినిమా( Rakta Charitra ) టైం నుంచి ఆయన జనాల రక్తం తాగడం మొదలు పెట్టారు.ఈ సినిమా తర్వాత దాదాపు రెండు డజన్ల సినిమాలు తీశారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా జనాలకు అర్థం కాలేదు.అలాగే విజయం సాధించలేదు.ఆయనకు నచ్చిన టైటిల్స్ పెట్టేసి పిచ్చిపిచ్చిగా సినిమాలు తీసేస్తూ వస్తున్నాడు.ఇక తాజాగా వ్యూహం సినిమా( Vyuham Movie ) విడుదల అయింది.కొన్ని వెబ్సైట్స్ సున్నా రేటింగ్ ఇవ్వాలన్నా కూడా టైం వేస్ట్ అని ఫీల్ అయ్యేవిధంగా ఉంది ఈ చిత్రం.
సరే రివ్యూలు, రేటింగులు సంగతి పక్కన పెడితే రాంగోపాల్ వర్మ అనే ఒక దర్శకుడుని నమ్మి ఇంకా కూడా డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్లకు దండం పెట్టాలి.డబ్బులు ఎక్కువ అయ్యి సినిమాలు తీస్తున్నారా లేక పిచ్చి ముదిరి తీస్తున్నారా అనేది అర్థం కావడం లేదు.

దయచేసి ఇలాంటి దర్శకులను ఎంకరేజ్ చేసి జనాలపైకి రుద్దడం వల్ల ఎవరికి లాభం లేదు.ఇకనైనా ఆపితే ఎంతో నయం.ఈ విషయం నిర్మాతలకు తెలుసు.ఆ సినిమాలో నటించే వారికి కూడా తెలుసు.
ఆర్జీవీ సినిమాలకు అసలు డబ్బులు రావు అని.అయినా కూడా ఆయన మాటలుకు అలా పడిపోతూ ఉంటారు.డబ్బులు పెడుతూ ఉంటారు.ఇక సినిమాను చాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్ లేదా లైట్ బాయ్ ఆఫీస్ బాయ్ షూట్ చేస్తారనుకుంటా.ఇది చాల రోజులుగా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.రాంగోపాల్ వర్మ కెరియర్ మొదట్లో శివ సినిమా( Shiva Movie ) నుంచి తీసిన సినిమా దృష్టిలో పెట్టుకుని థియేటర్ కి వెళ్తే మాత్రం పిచ్చి పట్టి బయటకు రావడం ఖాయం.