ఆర్జీవీ మిస్సింగ్‌ : ఆ రెండు ఫ్యామిలీలే కారణమట!  

RGV Missing, Ram Gopal varma Movie, Pawan kalyan, Chiranjeevi, ABN, OTT, RGV New Movie - Telugu Abn, Chiranjeevi, Ott, Pawan Kalyan, Ram Gopal Varma Movie, Rgv Missing, Rgv New Movie

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య వరుసగా వివాదాస్పద చిత్రాలు తీస్తున్నాడు.సినిమాలు అనే కంటే షార్ట్‌ ఫిల్మ్‌ అనొచ్చేమో.

 Rgv Missing Movie

ముప్పావు గంటకు అటు ఇటుగా ఉంటున్న ఈ సినిమాలను డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ పై విడుదల చేస్తున్నాడు.వరుసగా ఈయన చేస్తున్న సినిమాలు చెత్త అనిపించుకుంటున్నా కూడా తన ప్రయత్నాలు మాత్రం మానడం లేదు.

త్వరలో మర్డర్‌ మరియు మిస్టరీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వర్మ కొత్త ఐడియా వచ్చిందంటూ ప్రకటించాడు.

ఆర్జీవీ మిస్సింగ్‌ : ఆ రెండు ఫ్యామిలీలే కారణమట-Movie-Telugu Tollywood Photo Image

రామ్‌ గోపాల్‌ వర్మ ‘ఆర్జీవీ మిస్సింగ్‌’ అనే సినిమాను ప్రకటించాడు.

తనపై తానే సినిమాను తీసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు.ఆర్జీవీ మిస్సింగ్‌ అనే ఐడియా ఇప్పుడే వచ్చింది.

దాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాను.ఆర్జీవీ కనిపించక పోవడంతో కంపెనీ ఆఫీస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

అసలు వర్మను ఎవరు అయినా కిడ్నాప్‌ చేశారా లేదా ఆయనే అజ్ఞాతంలోనికి వెళ్లాడా అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్‌ కళ్యాణ్‌ చిరంజీవిలతో పాటు సిబిఎన్‌ మరియు లోకేష్‌లను కూడా చూపించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

వర్మను వీరిలో ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారు అంటూ కంపెనీ ఆఫీస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంటారు.పోలీసులు వారిని ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో వర్మ వస్తాడట.

అసలు వర్మ ఎటు వెళ్లాడు ఎక్కడ నుండి వచ్చాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నారు.

#OTT #Pawan Kalyan #RGV New Movie #RGV Missing #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Missing Movie Related Telugu News,Photos/Pics,Images..