ఆ మాట వల్ల శ్రీదేవికి భర్త అయ్యే ఛాన్స్ కోల్పోయిన ఆర్జీవీ.. ఏమైందంటే?

రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా, ఏం మాట్లాడినా సంచలనం అనే సంగతి తెలిసిందే.ఆర్జీవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి చాలా సంవత్సరాలైంది.

 Director Rgv Missed Opportunuity To Marry For These Reasons, Following Reasons,-TeluguStop.com

ఆర్జీవీ డైరెక్షన్ లో భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తాయని ఎవరూ నమ్మడం లేదు.అయితే దర్శకుడు ఆర్జీవీ శ్రీదేవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

శ్రీదేవి అందానికి వర్మ భక్తుడిగా మారిపోయారు.శ్రీదేవిని ఆరాధ్య దేవత అని చెప్పడంతో పాటు ఆమెతో సినిమాలను కూడా తెరకెక్కించారు.

గతంలో రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి పేరుతో ఒక సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.ఎమోషన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్మ శ్రీదేవిపై అభిమానాన్ని సమయం వచ్చిన ప్రతి సందర్భంలో చాటుకుంటూ ఉన్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ గోవిందా గోవింద షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.

గోవిందా గోవింద మూవీ షూటింగ్ జరిగే సమయానికి ఇండియాలోని టాప్ హీరోయిన్లలో శ్రీదేవి ఒకరని అయితే శ్రీదేవికి ఆ సినిమా షూటింగ్ సమయంలో ట్యాక్స్ సమస్యలతో పాటు ఇతర సమస్యలు చుట్టుముట్టాయని వర్మ అన్నారు.

Telugu Boney Kapoor, Govinda Govinda, Love Propose, Problems, Opportunity, Rgv S

శ్రీదేవి ఒంటరిగా ఉండేవారని మనీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన లెక్కలు ఆమెకు పెద్దగా తెలియదని వర్మ పేర్కొన్నారు.గోవిందా గోవింద షూటింగ్ సమయానికి తాను భార్యతో విడిపోయానని వర్మ అన్నారు.

Telugu Boney Kapoor, Govinda Govinda, Love Propose, Problems, Opportunity, Rgv S

ఆ సమయంలోనే శ్రీదేవి బోనీ కపూర్ గురించి తనకు చెప్పిందని శ్రీదేవి యొక్క మానసిక పరిస్థితిని తాను అర్థం చేసుకున్నానని వర్మ పేర్కొన్నారు.శ్రీదేవికి తన ప్రేమను వ్యక్తపరిచి ఉంటే తనకు, శ్రీదేవికి పెళ్లి జరిగేదని అయితే అప్పటికే తన జీవితంలోని ఊర్మిళ రావడంతో పాటు శ్రీదేవిపై తనకు ఉండే అభిమానం వల్ల ఆమెకు ప్రపోజ్ చేయలేదని వర్మ చెప్పుకొచ్చారు.ఒకవేళ వర్మ ప్రపోజ్ చేసి ఉంటే మాత్రం ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు చోటు చేసుకుని ఉండేవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube