వర్మ మరో సెన్సేషన్.. ‘నగ్నం’గా వస్తాడట!  

Rgv Mia Malkova - Telugu Climax Movie, Mia Malkova, Nagnam, Ram Gopal Varma, Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలకు తెరలేపుతు శృంగార తార మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమాను తెరకెక్కించాడు.గతంలో ఆమెతో వర్మ చేసిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

 Rgv Mia Malkova

ఇప్పుడు అంతకు మించిన సెన్సేషన్ క్లైమాక్స్ చిత్రంతో క్రియేట్ చేసేందుకు వర్మ రెడీ అయ్యాడు.ఈ సినిమాలో కుర్రకారుకు పిచ్చెక్కించే అంశాలు బోలెడున్నాయంటున్న వర్మ, దీన్ని వెబ్ వరల్డ్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమా తరువాత కరోనా వైరస్‌పై తన నెక్ట్స్ మూవీ ఉంటుందని, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశానంటూ చెబుతున్నాడు.కాగా రీసెంట్‌గా ‘కరోనా’ ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

వర్మ మరో సెన్సేషన్.. ‘నగ్నం’గా వస్తాడట-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సందర్భంగా తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలు తీయడమే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు అని వర్మ చెప్పుకొచ్చాడు.కాగా వర్మ మరో సినిమాను కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమాకు ‘నగ్నం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడట.

ఈ సినిమాలో అడ్డూ అదుపు లేకుండా అందాల ఆరబోతలు ఉంటాయని, ఈ సినిమాను చూసేందుకు యూత్ తెగ ఆరాట పడతారని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక వెబ్ ప్లాట్‌ఫాంలకు సెన్సార్ కష్టాలు లేకపోవడంతో వర్మ తెరకెక్కించే సినిమాలను ఇక్కడే రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.మొత్తానికి వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ‘నగ్నం’గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Mia Malkova Related Telugu News,Photos/Pics,Images..

footer-test