Ram Gopal Varma Dasari Kiran : అసలు ఈ పూల దండ నాకెందుకు వేశారో అర్థం అవ్వట్లేదు.. ఆర్జీవీ వైరల్ కామెంట్స్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే.ఈయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.

 Rgv Makes Fun Comments On Dasari Kiran Birthday , Ram Gopal Varma, Tollywood, Bi-TeluguStop.com

ఎవరో ఒకరి పై సంచలన వాఖ్యలు చేస్తూ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు.అయితే ఎప్పుడు ఎవరో ఒకరిపై సెటైర్ లు వేసే రాంగోపాల్ వర్మ తాజాగా తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.

అసలే జరిగిందంటే.తాజాగా రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే వేడుకలకు హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ఆ బర్త్డే పార్టీలో రామ్ గోపాల్ వర్మని పెద్ద పూల మాలతో సత్కరించారు.అదే విషయం పై ఆర్జీవీ ఫన్నీగా స్పందిస్తూ.

మా వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే కి నాకు ఎందుకు దండ వేశారో అర్థం కావడం లేదు.వెరీ హ్యాపీ బర్త్ డే దాసరి కిరణ్ కుమార్ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు వర్మ.ఇకపోతే త్వరలోనే రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయ పరిస్థితులపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.అయితే ఆ సినిమా విడుదల అయ్యి ఎంతటి కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.కాగా ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చెయ్యబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పలు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలయ్యేలా వ్యూహం చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి ప్రకటించడానికి ముందు వర్మ ఏపీ సీఎం జగన్ ని కలసిన సంగతి మనందరికి తెలిసిందే.కాగా రాంగోపాల్ వర్మ ఇప్పటికే తెలుగులో బోల్డ్, కాంట్రివర్సీ సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే.హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు ఎక్కువ శాతం సినిమాలు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగానే ఉంటాయి.

Ram Gopal Varma Tweet on Dasari Kiran Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube