నాగార్జున తో అబ‌ద్దం చెప్పి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా టాలీవుడ్ కె బెంచ్ మార్క్ అయ్యింది

ఒక్కోసారి అబ‌ద్దాలు కూడా మంచి రిజ‌ల్ట్ ఇస్తాయి.చెప్పేది త‌ప్పైనా ముందు ముందు మంచి జ‌రుగుతుంద‌నుకుంటే ఆ త‌ప్పు త‌ప్పే కాదంటారు కొంద‌రు.

 Rgv Lies Gave Tollywood Block Buster Movie-TeluguStop.com

సేమ్ ఇలాగే చేసి.ఇండ‌స్ట్రీలో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

తండ్రి కొడుకుల మ‌ధ్య వివాదాన్ని ఆస‌రాగా చేసుకుని త‌న సినిమాకు కొబ్బరికాయ కొట్టేలా చేశాడు.ఇంత‌కీ ఎవ‌రా తండ్రీకొడుకులు? ఆర్జీవి ఏం అబద్దం చెప్పాడు? ఇప్పుడు తెలుసుకుందాం!

 Rgv Lies Gave Tollywood Block Buster Movie-నాగార్జున తో అబ‌ద్దం చెప్పి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా టాలీవుడ్ కె బెంచ్ మార్క్ అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రావుగారిల్లు సినిమాకు రామ్ గోపాల్ వ‌ర్మ అసిస్టెంట్ డైరెక్ట‌ర్.బాగా ఇంగ్లీష్ మాట్లాడే ఆర్జీవీతో నాగార్జున‌కు తొంద‌ర్లోనే స్నేహం పెరిగింది.ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.ఒక మంచి క‌థ ఉంటే తీసుకురా సినిమా చేద్దామ‌ని నాగార్జున ఆర్జీవీకి చెప్పాడు.వెంట‌నే ఓ హ‌ర్ర‌ర్ సినిమా క‌థ రాసి నాగార్జున‌కు వినిపించాడు.

అంత‌గా న‌చ్చ‌లేద‌ని నాగ్ చెప్పాడు.వెంట‌నే నాగార్జున బ్ర‌ద‌ర్ వెంక‌ట్ కు ఈ క‌థ చెప్పాడు.

ఈ త‌ర‌హా సినిమాలు నాగార్జున‌కు సూట్ కావ‌ని చెప్ప‌డంతో మ‌రో స్టోరీ రాశాడు.ఇంటికెళ్లి బ్రూస్ లీ, హిందీ అర్జున్ సినిమాలు చూశాడు.

రెండింటిని క‌లిపి ఓ స్టోరీ రాసి శివ అనే పేరు పెట్టాడు.

మ‌రుస‌టి రోజు నాగార్జున‌కు ఈ క‌థ‌ను చెప్పాడు.

నాగార్జునకు బాగా నచ్చింది.కానీ ఆ స‌మ‌యంలో నాగార్జున సోద‌రుడు వెంకట్‌పై నాగేశ్వరరావు కోపంగా ఉన్నారు.

కొద్ది రోజుల సంది మాట‌లు లేవు.తన క‌థ అంద‌రికీ న‌చ్చినా వీరిద్ద‌రు ఓకే చెప్ప‌లేదు.

ఎలాగైనా వీరి చేత ఒప్పించాల‌నుకున్నాడు ఆర్జీవి.ఓరోజు వెంకట్‌ దగ్గరికి వెళ్లిన వ‌ర్మ‌.

అక్కినేని గారు శివ సినిమా స్టార్ట్‌ చేయమన్నార‌ని చెప్పాడు.వెంకట్ చేయమన్నారని ఏఎన్నార్ కు చెప్పాడు.

ఇద్దరూ న‌మ్మి.శివ ప్రారంభానికి కొబ్బ‌రికాయ కొట్టారు.

Telugu Nagarjuna, Nageswarao, Ram Gopal Varma, Rgv, Shiva, Tollywood, Venkat-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమా విడుద‌ల అయ్యాక ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.ఆరోజు ఆర్జీవీ అబ‌ద్దం చెప్ప‌క‌పోతే.ఈ సినిమా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ద‌క్కేది కాదు.ఇండ‌స్ట్రీని శివ‌కు ముందు, శివ‌కు త‌ర్వాత అనేలా సెట్ చేసింది ఈ సినిమా.త‌న క‌థ‌, టేకింగ్, కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని అద్భుతం.అందుకే జ‌నాల నుంచి అద్భుత రీతిలో ఆద‌ర‌ణ ద‌క్కింది.

శివ‌కు ముందు నాగార్జున కోసం ఆర్జీవి రాసిన క‌థే.రాత్రి అనే సినిమాగా వ‌చ్చింది.

రేవ‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌ట‌టించిన ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది.

#Venkat #Nageswarao #Nagarjuna #Shiva #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు