రజినీకాంత్ కన్నా రామ్ గోపాల్ వర్మ మిన్న

గట్టిగా మాట్లాడుకుంటే, సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద అందగాడు ఏమి కాదు.బక్కపలచని దేహం, ఎత్తు కూడా మామూలుగానే ఉంటాడు.

 Rgv Is Handsome Than Rajinikanth – Says Krk-TeluguStop.com

రంగు తక్కువే.అయినా, భారతదేశంలో ఆయన్ని మించిన సూపర్ స్టార్ లేడు.

ఆయనకున్న ఫాలోయింగ్ మనదేశంలో ఏ హీరోకి లేదు అనడం అతిశయోక్తి కాదు.ఇదంతా ఎలా సాధించాడు అంటే , స్టయిల్ .ఆ స్టయిల్ కే పడిపోయారు అంతా.


మరి అలాంటి రజినీకాంత్ కన్నా రామ్ గోపాల్ వర్మ మిన్న అంటున్నాడు బాలివుడ్ సంచలన క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే.

రజినీకాంత్ కన్నా రామ్ గోపాల్ వర్మ చాలా అందంగా ఉంటాడని, రజినీకాంత్ సూపర్ స్టార్ అయినప్పుడు, అందంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ అంతకంటే పెద్ద స్టార్ అవ్వాలని వాఖ్యనించాడు కేఆర్కే.


మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసిన వీరిద్దరూ, గతకొన్ని రోజులుగా రజినీకాంత్ మీద పడ్డారు.

ఇలా అందరిని మీద సెటైర్లు వేయడం వాళ్ళకో సరదా.మనకేమో టైమ్ పాస్.

ఉండాలండి ఇలాంటివారు కూడా భూమి మీద.లేదంటే ప్రపంచం రొటీన్ గా , చప్పగా ఉంటుంది.పవన్ కళ్యాణ్ అయిపోయాడు, రజినీకాంత్ ని ఆడుకుంటున్నారు ఇప్పుడు, ఆ తరువాత ఎవరో మరి వీరిద్దరి బకరా.


Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube