నాగబాబు బూతులు, గట్టిగా బదులిచ్చిన వర్మ   RGV Hits Hard Naga Babu’s Abuse At Him     2017-01-07   22:51:24  IST  Raghu V

కొత్తగా చెప్పేదేముంది .. హీరో హీరోయిన్, డైరెక్టర్, చివరికి ప్రధానమంత్రి అయిన, ఇంకా చెప్పాలంటే తనమీద కూడా సెటైర్లు వేసుకునే మనిషి రామ్ గోపాల్ వర్మ. ఎప్పటిలాగే ఖైదీనం 150 మీద, ఆ సినిమా పాటలు, పోస్టర్ల మీద వర్మ వ్యంగంగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతూపోయారు.

ఈ విషయం నాగబాబుకి నచ్చలేదు. దాన్ని నిన్న ఖైదీనం 150 ఫంక్షన్ లో ప్రస్తావిస్తూ వర్మ మీద తిట్ల దండకాన్ని అందుకున్నారు. “వాడు”, “అకుపక్షి” “సన్నాసి” అని సంభోదిస్తూ, అలాంటి పనులు ముంబైలో చేసుకోవాలని, మెగాఫ్యామిలి కష్టపడి పైకివచ్చింది, వాడిలాగా అడ్డదారిలో డైరెక్టర్ కాలేదని చాలా ఆవేశంగా మాట్లాడేశారు నాగబాబు. ఆ కామెంట్స్ వర్మ గురించి అని వేరే చెప్పాలా?

దానికి వర్మ మరింత ఘాటుగా స్పందించారు. మొదట సారీ చెబుతున్నట్లు ట్వీట్స్ వేసిన వర్మ, ఆ తరవాత తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పి, మళ్ళీ తనదైన శైలిలో జవాబిచ్చారు.

తన కెరీర్ వలన ఎన్నో కుటుంబాల బ్రతుకుతున్నాయి, కాని నాగబాబు తన అన్నయ్య కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. తన కెరీర్ గురించి మాట్లాడే ముందు తన “జబర్దస్త్” కెరీర్ గురించి చూసుకోవాలి, చిరంజీవికి పార్టీ పెట్టాలనే సలహా ఇచ్చి పాడుచేసింది నాగబాబే, ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాల మీద మాట్లాడగలను, చిరంజీవి గారు ఇంకోసారి నాగబాబుని ఫంక్షన్స్ కి తీసుకువెళ్ళకపోతేనే బాగుంటుంది అంటూ ట్వీట్స్ మీద ట్వీట్స్ వేసుకుంటూపోయారు వర్మ.

నాగబాబు కేవలం వర్మ మీదే కాదు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మీద కూడా “వాడు” అని సంబోధిస్తూ ఘాటైన వ్యాఖ్యలే చేసారు. వీరేంద్రనాథ్ నాగబాబు వ్యాఖ్యాలపై కలత చెందారు.