ఆర్జీవీ సినిమాతో బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసిన హాట్ భామ

ఆర్జీవీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటే కచ్చితంగా ఆ భామని ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చేస్తుంది.తాజాగా నగ్నం సినిమాలో నటించిన శ్రీరాపాక అనే తెలుగమ్మాయికి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న రాని ఇమేజ్ ఒక్క రాత్రికే వచ్చేసింది.

 Rgv Heroine Got Big Boss Chance, Big Boss Season 4, Thriller Movie, Star Maa, Ap-TeluguStop.com

ఇక అందాల ఆరబోతకి ఎలాంటి హద్దులు చెప్పకుండా ఉండే అమ్మాయిలనే ఆర్జీవీ హీరోయిన్స్ గా పరిచయం చేస్తాడు.ఆడవాళ్ళని ఒక అందమైన వస్తువుగా మాత్రమే చూసే ఆర్జీవీ అంతే స్థాయిలో వారి శరీరంలో ప్రతి భాగాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు.

ప్రస్తుతం ఆర్జీవీ టీమ్ లోకి మరో అందం వచ్చి చేరింది.ఈ అమ్మడు పేరు అప్సరారాణి.

ఒడిస్సాకి చెందిన ఈ భామ మొదలైంగ్ నుంచి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే ఓ రెండు చిన్న సినిమాలు చేసింది.

అయితే వాటితో రాని గుర్తింపు ఆర్జీవీ సినిమాలో చేయబోతుంది అని చెప్పగానే వచ్చేసింది.

ప్రస్తుతం ఈ భామతో ఆర్జీవీ థ్రిల్లర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశాడు.ఇదిలా ఉంటే ఆర్జీవీ కారణంగా వచ్చిన ఇమేజ్ తో ఇప్పుడు ఈ భామ తెలుగు బిగ్ బాస్ షో లో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం అవుతుంది.ఈ షో కోసం ఇప్పటికే పార్టిసిపెంట్స్ ని ఎంపిక చేశారు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ కోసం అప్సరారాణినికూడా ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు.అయితే తెలుగు బిగ్ బాస్ షోలో ఎక్కువగా తెలుగు వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తారు మరి ఈ అమ్మడుకి అస్సలు తెలుగు రాదు.

మరి అలాంటప్పుడు ఎలా ఎంపిక చేస్తారు అనే మాట కూడా బలంగా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube