ఆ విషయంలో గొప్ప మనసు చూపిస్తున్న ఆర్జీవీ

ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మలో హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది అని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.మహిళల సమానత్వం, వారు అన్ని రంగాలలో మగవాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకునే వారిలో ఆర్జీవీ ముందు ఉంటాడు.

 Rgv Gets Viral For His Kind Heart On Renuka-TeluguStop.com

ప్రస్తుతం దిశ అత్యాచార ఘటనపై సినిమాని తెరకెక్కిస్తున్న ఆర్జీవీ ఆ ఘటనలో భర్తని కోల్పోయి ఒంటరి జీవితం అనుభవిస్తున్న చెన్నకేశవులు భార్య రేణుక విషయంలో చాలా మానవత్వంతో ఆలోచిస్తున్నాడు.కనీసం మహిళా సంఘాలు, ప్రభుత్వం, కుల సంఘాలు కూడా పట్టించుకోని ఆమెని ఆర్జీవీ పట్టించుకున్నాడు.

తన వంతుగా కొంత ఆర్ధిక సాయం అందించాడు.

ఇదిలాఉంటే ఇప్పుడు చెన్నకేశవులు భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ నేపథ్యంలో, ఆమెకు సాయం చేయాలని రామ్ గోపాల్ వర్మ కోరారు.‘చెన్నకేశవులు భార్య రేణుక బిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.భవిష్యత్తులో రేపిస్టుల నీడ వారిపై పడకుండా ఉండాలంటే దయచేసి వారికి ఎవరికి తోచిన సాయం వారు చేయండి’ అని ట్వీట్ చేశారు.

యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎసీ కోడ్ ను షేర్ చేశారు.ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆర్జీవీలో ఇంత మానవత్వం ఉందా అని నెటిజన్లు కామెంట్స్ చేయడంతో పాటు రేణుకకి సాయం అందించేందుకు చాలా మంది ముందుకి వస్తున్నారు.

మొత్తానికి తన ఆలోచనతో ఆర్జీవీ తిట్టించుకోవడంతో పాటు ఇప్పుడు తాను ఎంత ప్రత్యేకమైన వ్యక్తినో అనేది రుజువు చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube