వర్మ ఎఫెక్ట్‌ : ‘ఎన్టీఆర్‌’లో మార్పులు చేర్పులు?     2018-10-26   09:57:57  IST  Ramesh Palla

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం వచ్చే జనవరిలో విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రతో పాటు చంద్రబాబు నాయుడు పాత్ర కూడా చాలా ప్రముఖంగా కనిపించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయ మైలేజీని పెంచేందుకు బాలకృష్ణ ఈ చిత్రాన్ని వాడాలని భావించాడు. అందుకోసం స్క్రిప్ట్‌లో చంద్రబాబు నాయుడుకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేలా, ఒక మంచి వ్యక్తిగా చంద్రబాబు నాయుడును చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే వర్మ ఎప్పుడైతే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ప్రకటించాడో అప్పుడే ‘ఎన్టీఆర్‌’ చిత్రం విషయంలో మార్పులు చేర్పులు మొదలయినట్లుగా తెలుస్తోంది.

RGV Effect On Balakrishna's NTR Biopic-

RGV Effect On Balakrishna's NTR Biopic

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చంద్రబాబు నాయుడు భజన ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించే అవకాశం ఉంది. వర్మ సినిమా వైపు ఆకర్షితం అయ్యే ఛాన్స్‌ ఉంది. అందుకే ఈ చిత్రంలో ముందుగా అనుకున్నట్లుగా కాకుండా చంద్రబాబు పాత్రకు కాస్త ప్రాముఖ్యతను తగ్గించడంతో పాటు, ఆయన పాత్ర నిడివిని కూడా తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. వరుసగా రెండు పార్ట్‌లను రెండు వారాల గ్యాప్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు పార్ట్‌ల్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించబోతున్నాడు.

RGV Effect On Balakrishna's NTR Biopic-

ఎన్టీఆర్‌ కథానాయకుడు పార్ట్‌లో చంద్రబాబు నాయుడు పాత్ర లెంగ్త్‌ను తగ్గించే యోచనలో దర్శకుడు క్రిష్‌ ఉన్నాడు. మొదటి పార్ట్‌ లో ఎక్కువగా చంద్రబాబు నాయుడును చూపిస్తే రెండవ పార్ట్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉందని క్రిష్‌ భావిస్తున్నాడు. ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల చేయబోతున్న రోజునే వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. తప్పకుండా భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో చంద్రబాబు పాత్ర తక్కువగా కనిపించబోతుందని, అది వర్మ కారణంగానే అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.