ట్రైలర్ టాక్: దిషా కథను ట్రైలర్‌లోనే చెప్పేసిన వర్మ  

RGV Disha Encounter Trailer Released - Telugu Disha Encounter, Disha Trailer, Ram Gopal Varma, Rgv, Rgv Disha Encounter, Tollywood News

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ప్రతి సినిమా ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.

TeluguStop.com - Rgv Disha Encounter Trailer Released

అటు బయోపిక్ చిత్రాలతో పాటు హాట్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న మరో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

గతేడాది తెలంగాణలో జరిగిన దిషా ఉదంతం అందరికీ తెలిసిందే.

TeluguStop.com - ట్రైలర్ టాక్: దిషా కథను ట్రైలర్‌లోనే చెప్పేసిన వర్మ-Gossips-Telugu Tollywood Photo Image

ఒంటరిగా ఉన్న దిషాను నలుగురు వ్యక్తులు హత్యాచారం చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని ఊపేసింది.

కాగా దిషా ఉదంతాన్ని ‘దిషా ఎన్‌కౌంటర్’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు వర్మ.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా వర్మ రిలీజ్ చేశారు.ఈ సినిమా ట్రైలర్‌లోనే సినిమా కథను పూర్తిగా చూపించేశాడు వర్మ.ఆనంద్ చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిషా ఉదంతాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ.

కాగా ఈ సినిమాను వర్మ తనదైన శైలిలో మలిచిదిద్దినట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఒక అమ్మాయి స్కూటీ పాడైపోయి ఉన్న విషయాన్ని గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను ఎలా ఎత్తుకెళ్లారు, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటనేది ఈ సినిమాలో మనకు చూపించనున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్, సోనయా ఆకుల, ప్రవీణ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.కాగా ఈ సినిమాను నటి క్రాంతి మరియు నటి కరుణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

#Ram Gopal Varma #RGVDisha #Disha Trailer #Disha Encounter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Disha Encounter Trailer Released Related Telugu News,Photos/Pics,Images..